చంద్రబాబు, బిల్ గేట్స్  బంధం ఈ నాటిది కాదు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ( మార్చి 19) ఢిల్లీ పర్యటనలో భాగంగా టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం గురించి చంద్రబాబు ఎక్స్ వేదికగా  ట్వీట్ చేశారు. బిల్ గేట్స్ తో సమావేశం విజయవంతంగా ముగిసిందని చంద్రబాబు ఆ ట్వీట్ లో రాసుకొచ్చారు. 
  ప్రపంచ కుబేరుడు, మైక్రోసాప్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో చంద్రబాబు బంధం ఈ నాటి కాదు.1995 నుంచి వీరి మధ్య సత్సంబంధాలున్నాయి.  ఇటీవల చంద్రబాబు దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఈ పాత స్నేహితులు కొత్తగా కలుసుకున్నారు.   బిల్ గేట్స్ తో తన పాత స్మృతులను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. దావోస్ పర్యటనలోనే బిల్ గేట్స్ తను రచించిన పుస్తకాన్ని  చంద్రబాబుకు బహుమతిగా ఇచ్చారు. దావోస్ లో వీరువురు సమావేశమైన నేపథ్యంలో కొనసాగింపుగా ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది.