ఆ ఫొటోలంటే మండిపడుతున్న రాధా..!

 


వైసీపీ పార్టీలో ఇప్పటికే అసంతృప్తితో ఉన్న వంగవీటి రాధాకి... ఇప్పుడు కొన్ని ఫొటోలు నిద్రపట్టనివ్వడం లేదట. ఆ ఫొటోలు చూస్తుంటేనే రాధాకి ఆగ్రహం కట్టలు తెంచుకొని వస్తుందట. ఇంతకీ ఆ ఫొటోలు ఏంటనుకుంటున్నారా...?కడప ఎంపీ అవినాష్ రెడ్డి, గౌతమ్ రెడ్డి కలిసి ఉన్న ఫొటోలు. గౌతమ్ రెడ్డి వంగవీటి కుటుంబంపై చేసిన విమర్శల సంగతి తెలిసిందే. దీనికి గాను వంగవీటి రాధాతో పాటు ఆయన అనుచరులు, అభిమానులు గౌతమ్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు గాను జగన్ గౌతమ్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అయితే పార్టీ నుండి గౌతమ్ రెడ్డిని సస్సెండ్ చేశారు కానీ... ఆయన మాత్రం మామూలుగానే పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఈ విషయమే రాధాకి మింగుడుపడటం లేదు. దీనిలో భాగంగానే..గౌతమ్ రెడ్డి కడప ఎంపీ అవినాష్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకుని ఆయనతో సమావేశం అయ్యారు. అక్కడితో ఆగకుండా... అప్పుడు తీసుకున్న ఫొటోలతో ఫ్లెక్సీలు కూడా పెట్టారు. ఇప్పుడు ఆ ఫొటోలు విజయవాడ నిండా దర్శనమిస్తున్నాయి. రాధా ఏ పని మీద బయటికి వచ్చినా ఆ ఫోటోలు కనిపిస్తున్నాయి. పార్టీ నుంచి నన్ను బయటికి పంపినా అధిష్టానంతో నా సంబంధాలు అలాగే వున్నాయి అని గౌతమ్ రెడ్డి ఆ ఫొటోలతో సవాల్ విసిరినట్టు అనిపిస్తోందట రాధకి. అయినా ఎలాగోలా ఓర్చుకుందామని చూసినా ఇటీవల వైసీపీ కార్యవర్గ కూర్పులో విజయవాడకి సంబంధించి గౌతమ్ రెడ్డి అనుచరులకు పెద్ద పీట వేసింది పార్టీ. ఇదేమిటని సాక్షాత్తు అధినేత జగన్ ని అడిగినా వచ్చిన సమాధానం సంతృప్తిగా లేదట. ఈ పరిస్థితుల్లో అవినాష్ తో గౌతమ్ రెడ్డి ఫోటోలు చూస్తుంటే రాధాకృష్ణ కి మంటెత్తిపోతుందట.

 

దీంతో రాధాకి పార్టీలో ఉండాలో..వద్దా..? అని ఆలోచనలో పడ్డారట. మరోవైపు రాధాని పొమ్మన లేక పొగబెట్టినట్టు ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నారు. ఇక జగన్ తీరుతో అసంతృప్తితో ఉన్న రాధా కూడా అసలు ఆ పార్టీని వదిలేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనకి వచ్చారట. మరి జగన్ ఇలానే చేస్తే మరో కీలక నేతను పోగొట్టుకోవడం ఖచ్చితం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu