బీపీ ఆచార్యకి షరతులతోకూడిన బెయిల్
posted on Oct 17, 2012 10:42AM
.jpg)
ఎమార్ కేసులో ప్రథాన నిందితుడైన ఐఎఎస్ అధికారి బీపీ ఆచార్యకి సీబీఐ న్యాయస్థానం షరతులతోకూడిన బెయిల్ ని మంజూరు చేసింది. లక్ష రూపాయల చొప్పున ఇద్దరి పూజీకత్తులు సమర్పించాలని కోర్ట్ ఆదేశించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ లలో మాత్రమే ఉండాలని, తర్వాతి ఉత్తర్వు వచ్చేదాకా ప్రతి శుక్రవారం కోఠీలోని సిబిఐ ప్రథాన కార్యాలయంలో ప్రతి శుక్రవారం రిపోర్ట్ చేయాలని, పాస్ పోర్ట్ ని స్వాధీనం చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయ్తత్నం, సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేయకూడదని కోర్ట్ బీపీ ఆచార్యకి స్పష్టం చేసింది. బి.పి. ఆచార్యని జనవరి 30న సిబిఐ అరెస్ట్ చేసింది. ప్రాసిక్యూషన్ కి అనుమతిలేదన్న కారణంగా సీబీఐ కారణంగా సీబీఐ కోర్టు మార్చ్ 16న షరతులతో బెయిలు మంజూరుచేసింది. దీనిపై సీబీఐ హైకోర్టుని ఆశ్రయించింది. ఆచార్యకి బెయిల్ రద్దయ్యింది. మార్చ్ 29న ఆచార్య తిరిగి సిబిఐ కోర్టుముందు లొంగిపోయారు. అప్పట్నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. చివరిసారి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ని సెప్టెంబర్ 12 న కోర్ట్ కొట్టేసింది. సెప్టెంబర్ 15న సిబిఐ అనుబంధ చార్జ్ షీట్ ని దాఖలు చేసింది. ప్రస్తుతం బీపీ ఆచార్యకి బెయిల్ మంజూరు కావడంతో ఎమ్మార్ కేసులో నిందితుల్లో జగన్ కి బాగా సన్నిహితుడైన సునీల్ రెడ్డి తప్ప మిగిలినవాళ్లందరికీ బెయిల్ మంజూరైంది.