కోడెల మరణం మాకు సంతోషం: వంగవీటి

 

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణం పట్ల బీజేపీ నేత వంగవీటి నరేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెల చావుతో మేమంతా సంతోషంగా ఉన్నాం అన్నారు. '30 ఏళ్ల క్రితం బందరు రోడ్డులో పేదల ఇళ్ల పట్టాల కోసం వంగవీటి రంగా నిరాహార దీక్షకు దిగారు. అలాంటి ప్రజా నాయకుడిని టీడీపీ ప్రభుత్వ హయాంలో అతిదారుణంగా హత్య చేశారు' అంటూ నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. రంగా హత్య జరిగినప్పుడు కోడెల హోంమంత్రిగా ఉన్నాడు. కోడెల జిల్లా ఎస్పీ సాయంతో 3 సార్లు రంగా శిబిరం వద్ద రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్ తో చంపారని నరేంద్ర ఆరోపించారు. పోలీస్ శాఖలో రంగాకు అనుకూలంగా ఉన్న 300 మందికిపైగా పోలీసులను వారం రోజుల ముందే బదిలీ చేసారని ఆరోపించారు. ఇలా కుట్రపూరితంగా రంగా చావుకు కారణమైన ముఖ్యమైనవారిలో కోడెల ఒకరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు కోడెల అనే నీచుడు చనిపోయాడు. ఆయన చావుతో మేమంతా సంతోషంగా ఉన్నాం అని నరేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.