ల్యాండింగ్ కి అంతరాయం.. విమానంలో వైఎస్ విజయమ్మ!!

 

వాతావరణం బాగాలేకపోవడంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న విమానం గాలిలోనే చక్కర్లు కొడుతోంది. కృష్ణా జిల్లాలో ఈరోజు భారీ వర్షంతో పాటు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో గన్నవరం విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. తాజాగా హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న ఓ ఇండిగో విమానం ల్యాండింగ్ కు వీలుకాక గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ విమానంలో విజయమ్మ కూడా ఉన్నారు. హైదరాబాద్ నుంచి విమానం బయలుదేరే సమయంలో వాతావరణం బాగానే ఉన్నప్పటికీ గన్నవరంకు చేరుకునే సమయానికి వాతావరణం మారిపోయింది. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో విమానం దించేందుకు పైలెట్లు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.