బిహార్ లో ఆటవిక రాజ్య స్థాపనకి లాలూ బ్రేక్స్?
posted on Nov 26, 2015 2:21PM
.jpg)
బిహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ కి చెందిన ఆర్.జె.డి. పార్టీ నితీష్ కుమార్ కి చెందిన జెడీయూతో జత కట్టడంతో కలిసి మళ్ళీ చాలా ఏళ్ల తరువాత రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగింది. లాలూ రాజ్యం అంటే ఆటవిక రాజ్యమేనని మోడీ, అమిత్ షాలు ముందే హెచ్చరించారు. నితీష్ కుమార్ ప్రభుత్వం కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలకి క్వార్టర్స్ లో ఫ్లాట్స్ కేటాయించక మునుపే ఆర్.జె.డి. పార్టీ ఎమ్మెల్యేలు రాజధాని పాట్నాలో తమకు నచ్చిన ప్రభుత్వ బంగ్లాలను ఆక్రమించేసుకొన్నారు. ఆర్జేడీ పార్టీకి చెందిన అరుణ్ కుమార్ యాదవ్ మరియు అనిల్ కుమార్ యాదవ్ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు, వేరే ఎవరో ఉంటున్న భవనాన్ని ఆక్రమించేసుకొని, వాటిపై తమ నేమ్ ప్లేట్లు పెట్టేసుకొన్నారు. వారిని చూసి జెడీయూ ఎమ్మెల్యేఆర్.ఎన్. సింగ్ కూడా తనకు నచ్చిన బంగ్లాను ఆక్రమించేసుకొని తన బోర్డు తగిలించేసుకొన్నారు.
వారి అత్యుత్సాహం చూసి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా షాక్ తిన్నారు. తక్షణమే తన పార్టీ ఎమ్మెల్యేలందరినీ సమావేశపరిచి, “మనకి ఓటేసి గెలిపించిన ప్రజలు మన ప్రతీ కదలికని, మాటని నిశితంగా గమనిస్తున్నారు. కనుక ఎవరూ క్రమశిక్షణను ఉల్లంఘించడానికి వీలులేదు. ప్రభుత్వమే అందరికీ తగిన భవనాలను కేటాయిస్తుంది. అంతవరకు ఓపికగా వేచి ఉండండి,” అని గట్టిగా హెచ్చరించారు.