'కల్కి 2898 AD' యూఎస్ రిపోర్ట్.. హిట్టా ఫట్టా..?

ప్రభాస్ (Prabhas) అభిమానులతో పాటు సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూసిన 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) చిత్రం వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్ లో మొదటి షోలు పూర్తయ్యాయి, ఇండియాలో మొదలయ్యాయి. మరి ఈ సినిమా యూఎస్ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం.

కల్కి స్టోరీ లైన్ కొత్తగా ఉంది. ఇప్పటివరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఇలాంటి కథతో సినిమా రాలేదు. మూవీ ప్రారంభమవ్వడమే ఒక కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకువెళ్తుంది. విజువల్ గా హాలీవుడ్ చిత్రాలను తలదన్నేలా, ఐ ఫీస్ట్ లా ఉంది. ముందు నుంచి అందరూ చెబుతున్నట్టుగానే.. క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. చివరి 20 నిమిషాలు ఈ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది. ఈ మూవీలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మార్క్ డ్రామా మిస్ అయినప్పటికీ, అక్కడక్కడా కొన్ని సీన్స్ నెమ్మదిగా సాగినట్లు అనిపించినప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇంట్రో, ఇంటర్వెల్, క్లైమాక్ తోనే పైసా వసూల్ మూవీ అనే భావన కలుగుతుంది. అలాగే సినిమాలో ఎన్నో సర్ ప్రైజ్ లు ఉన్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే, ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ మీద చూసి అనుభూతి చెందాల్సిన సినిమా కల్కి.