వెండితెరపైకి సత్యసాయి జీవితచరిత్ర

పుట్టపర్తి: దేశ విదేశాల్లో కోట్లాది మంది భక్తుల అభిమానాన్ని చూరగొన్న సత్యసాయి జీవితచరిత్ర త్వరలో వెండితెరపై కనిపించనుంది. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ బాబా జీవితచరిత్రను సినిమా రూపంలో తెచ్చేందుకు సోమవారం పుట్టపర్తి వచ్చారు. పుట్టపర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ట్రస్టు సభ్యులు, బాబా కుటుంబసభ్యులతో   చర్చించిన తర్వాత కధకు తుదిరూపు తెస్తానన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తెలుగు, ఇంగ్లిషుతో పాటు దేశంలోని అన్ని భాషల్లోనూ సినిమా విడుదల చేస్తామన్నారు. గురుపౌర్ణమి రోజున షూటింగ్ ప్రారంభించి బాబా జన్మదినమైన నవంబర్ 23న సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. షూటింగ్ ఎక్కువ భాగం పుట్టపర్తి పరిసరప్రాంతాల్లో ఉంటుందని కోడి రామకృష్ణ చెప్పారు.