ఎనీటైం సెక్స్ కేంద్రాలు
posted on Oct 17, 2012 10:35AM
.png)
ఎనీటైంమనీ(ఏటీఎం) పేరు మార్చుకుంటోంది. ఈ ఏటిఎం కేంద్రాలు శృంగారానికి వేదికలవుతున్నాయి. ఓ అమ్మాయి, ఓ అబ్బాయి ఒకేసారి కార్డులు తీసుకుని లోనికి ఎంటరై 40నిమషాల పాటు పని చూసుకుని కార్డులు, బ్యాలెన్స్‌లు చూసుకుంటూ వెళ్లిపోతున్నారు. జనసమ్మర్దం లేని ప్రాంతాల్లోని ఏటిఎంలు ఇలా శృంగారకేంద్రాలుగా మారటానికి గార్డులు కూడా పరోక్షంగా కారణమవుతున్నారు. గార్డుల చేతిలో డబ్బు పెట్టి పోలీసులకు దొరక్కుండా శృంగారం చేయటంలో కృష్ణాజిల్లా కుర్రకారు రికార్డు సృష్టిస్తున్నారు. వీరి రాసలీలలు బ్యాంకు సిసి కెమేరాల్లో నమోదవుతోంది. విజయవాడ శివారు ప్రాంతంలో జరుగుతున్న ఈ తంతును బ్యాంకు సిబ్బంది చూసి తలలు పట్టుకుంటున్నారు. పోలీసుల ఆదేశాల మేరకు ఏటిఎంల్లో సిసికెమేరాలు అమర్చిన బ్యాంకులు ఈ క్లిప్పింగులను పైకి పంపించనూలేక, డిలీట్ చేయనూలేక ఇబ్బంది పడుతున్నారు.