మళ్లీ కోత వేళలు పెరుగుతాయా ?
posted on Oct 17, 2012 9:33AM
.png)
రాష్ట్రంలో విద్యుత్తుకోత వేళాపాళా లేకుండా పోయిందన్న ఆందోళన నానాటికీ పెరుగుతోంది. గతంతో పోల్చుకుంటే కొంత వరకూ నయమే అని రాష్ట్రప్రభుత్వం సమర్ధించుకుంటున్నా ప్రజలు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు ఉత్పత్తికి ఎన్నో అవరోధాలు ఎదురవుతుంటే కోత వేళలు పెరగకతప్పదని పరిస్థితి అర్థమవుతోంది. గతంలో శ్రీశైలం జల విద్యుత్యుత్పాదన కేంద్రంలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. యుద్ధ ప్రాతిపదికన మేల్కంటే అక్కడ ఉత్పత్తి ప్రారంభానికి ఓ వారంపైనే సమయం వృథా అయింది. ఇప్పుడు మళ్లీ వరంగల్ జిల్లాలోని కేటిపిఎస్ 5వదశలోని 9వయూనిట్‌లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో 500మెగావాట్ల విద్యుత్తు ఆగిపోయింది. కేటీపిఎస్ బాయిలర్‌లో ఎయిర్‌ట్యూబ్ లీకేజీ కూడా ఇదే సమయంలో జరిగిందని అధికారులు గుర్తించారు. దీంతో ఇక్కడ ఇంకో 250మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిరది. ఇలా రెండుయూనిట్లలో 750మెగావాట్ల విద్యుత్‌ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిరది. రెండు రోజుల పాటు పునరుద్దరణ చర్యలు తప్పవని అధికారులు ధృవీకరిస్తున్నారు. రాష్ట్రంలో దీని ప్రభావం వల్ల కోత పెరుగుతుందని భావిస్తున్నారు.