అటు ఎండి బదిలీ.. ఇటు ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్.. అనుమానాలు నిజమేనా!!

 

ఏపీలో ఆర్టీసీ ఎండి పదవి నుండి బదిలీ ఆంటే అది డిజిపి పోస్టులోకే అని గతంలో జరిగిన కొన్ని డిజిపి నియామకాలను బట్టి చూస్తే అర్ధమౌతుంది. ఐతే తాజాగా ఆర్టీసీ ఎండి సురేంద్ర బాబు బదిలీని పరిశీలిస్తే ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా డిజిపి ఆఫీసులో రిపోర్ట్ చేయమంటు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐతే ముక్కుసూటి మనిషిగా పేరున్న ఆయనను అటు డిజిపి ఆఫీసుకు పంపడం ఇటు ఆర్టీసీలో 350 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కోసం టెండర్ పిలవడం చకచకా జరిగి పోయాయి. ఐతే సొషల్ మీడియాలో మాత్రమే దీని పై పెద్ద దుమారమే రేగుతోంది. దీని వెనుక పోలవరం రివర్స్ టెండర్ దక్కించుకున్న బడా సంస్థ ఉందని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. పోలవరం పనులలో వచ్చే నష్టాన్ని కవర్ చేసుకోవడానికి ఈ ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్ట్ ఆ సంస్థకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. ఈ టెండర్ ను తాము అనుకున్న వారికి దక్కేలా చేయడం కోసమే ప్రస్తుత ఎండీని బయటకు పంపారని ప్రచారం జోరుగా సాగుతోంది.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu