బాబు నివాసం పై హైకోర్టుకు లింగమనేని.. విచారణ వాయిదా

 

చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని కూల్చి వేస్తామని సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఐతే దీనిపై తాజాగా వ్యాపార వేత్త లింగమనేని రమేష్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తాము సమర్పిస్తున్న వివరణలు, పత్రాలు తీసుకోకుండా కూల్చేస్తామంటూ సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇవ్వడంపై లింగమనేని రమేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లింగమనేని పిటీషన్ పై హైకోర్టు ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu