ప్రచారం ముగిసే రోజు నుంచి కోడ్ అమలట.. ఏపీ ఎన్నికల కమిషన్ స్పెషల్..
posted on Oct 22, 2021 7:15PM
తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలో బద్వేల్ అసెంబ్లీ నియోజక వర్గాలకు.. అదే విధంగా దేశంలో మరికొన్ని రాష్ట్రాలలో ఇంకొన్ని అసెంబ్లీ స్థానాలకు ఈ నెల అంటే, అక్టోబర్ 30 పోలింగ్ జరుగుతుంది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 28 న కేంద్ర ఎన్నికల కేంద్ర షెడ్యూలు విడుదల చేసింది.
అదే రోజు నుంచి ఎన్నికల నియమావళి, ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చేసింది ... అని కదా అనుకుంటున్నాం .. కానీ, అది తప్పు .. ఉయ్ ఆర్ రాంగ్... మనం తప్పులో కాలేశాం. షెడ్యూలు ప్రకారం నోటిఫికేషన్, నామినేషన్ల ఘటం ముగిసి ప్రచారపర్వం సాగుతోంది. అదంతా ఓకే ...అలాగే రేపు అక్టోబర్ 30 పోలింగ్ ... నవంబర్ 2 న ఓట్ల లెక్కింపు అన్నీ కూడా ... యథాతథంగానే ఉంటాయి .. అలాగే జరిగి పోతాయి ... కానీ...ఎలక్షన్ కోడ్ మాత్రం మీరు, నేను, మనం అనుకుంటున్నట్లుగా సెప్టెంబర్ 28 రాలేదు ... అక్టోబర్ 28వస్తుంది..
ఏంటి .. నీకేమన్నా మెంటలా ..తల తిరుగుతోందా .. అక్టోబర్ 28 కి ప్రచారం కూడా ముగిసి పోతుంది ..ఆరోజున ఎలక్షన్ కోడ్ అమలులోకి రావడం ఏమిటో, తిక్క సన్నాసి అంటారా? అలాయితే మీరు ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అక్టోబర్ 22న విడుదల చేసిన ఈ ప్రెస్ నోట్ ..చూడండి ..ఆ తర్వాత తిక్క ..పిచ్చ ..తల తిరుగుడు ఎవరికో .. మీరే డిసైడ్ చేసుకోండి
ఏపీ ఎన్నికల కమిషన్ ప్రెస్ నోట్..
The election commission of India has announced schedule for bye – election to 124 – Badvel (SC) Assembly constituency of Andhra Pradesh State vide press note no .ECI1/PN/83/202, dated 28
September, 2021 and the MODEL CODE OF CONDUCT came into effect from 28.10.2021../అని కదా ఉంది అంటే ఏంటి...పోలింగ్’కు రెండు రోజుల ముందు ఈనెల (అక్టోబర్) 28 ఎలక్షన్ కోడ్ అమలులోకి వస్తుంది ... చుసారా.. ఏముందో.. మరి ఇంత వరకు అమలులో ఉన్నది ఏమిటీ... అంటారా.. అదేమిటో శ్రీ కమిషన్ వారే సెలవియ్యాలి....