ఏపీ క్యాబినెట్‌లోనూ త్వరలో మార్పులు?

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికి రెండుసార్లు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేశారు. తీసుకోవడం, తీసేయడం, శాఖల్లో మార్పులు చేయడం లాంటి పరిణామాలను చకచకా చేసేశారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి ఎనిమిది నెలలు అవుతున్నా ఇప్పటి వరకూ మంత్రివర్గ విస్తరణ గానీ, మార్పు చేర్పులు గానీ జరగలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు మంత్రివర్గాన్ని విస్తరిస్తారా అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరలో ఏపీ మంత్రివర్గంలో కూడా మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ మంత్రుల్లో ఆశించిన స్థాయిలో పనితీరును కనబరచని వారు కొందరు ఉన్నారని, వారిని బాధ్యతల నుంచి తప్పించి కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారన్న అభిప్రాయాలు తెలుగుదేశం వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అదే జరిగితే ఏయే మంత్రులకు విశ్రాంతి ఇస్తారు.. ఎవరెవరికి అవకాశాలు ఇస్తారనేదానిమీద భారీ స్థాయిలో అంచనాలు టీడీపీ వర్గాల్లో వున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu