ఒక గంట ముద్దు కావాలంట...!

 

నితిన్ హీరోగా ప్రముఖ దర్శకుడు పూరీజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "హార్ట్ ఎటాక్". రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆదాశర్మ హీరోయిన్ గా నటిస్తుంది. "హార్ట్ ఎటాక్" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా విడుదల చేసారు. ఇందులో " I need A one hoUr KiSS to bUrn 3000 caloRies" అనే కొటేషన్ తో ఈ పోస్టర్ ను విడుదల చేసారు. టూరింగ్ టాకీస్ బ్యానర్ లో పూరి స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే ఆడియో విడుదల చేసి, సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.