10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్

 

దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లకు ఊరట లభించింది.  డెలివరీ బాయ్స్ డిమాండ్ మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని ఎత్తివేస్తూ కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదేశాలు జారీ చేశారు. 10 నిమిషాల్లోనే డెలివరీ అంటూ ప్రకటనలు ఇవ్వొద్దని బ్లింకిట్ సహా అన్ని క్విక్ కామర్స్ సంస్ధలకు కేంద్రం సూచించింది. 

కాగా  10 నిమిషాల నిబంధనను ఎత్తివేయాలంటూ కొత్త ఏడాదికి ముందు గిగ్ వర్కర్లు నిరసన చేపట్టారు.డెలివరీ బాయ్స్ తమ ప్రాణాలను పణంగా  ఆన్లైన్ డెలివరీ చేస్తున్నామని కానీ దానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదని యూనియన్లు గతంలో ఆందోళన నిర్వహించాయి. 10 నిమిషాల్లో డెలివరీ చేయమని కోరడం అన్యాయం. ఇది రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోంది" అని ఐఎఫ్ఏటి ప్రతినిధులు పేర్కొన్నారు.

రైడ్-హెయిలింగ్ డ్రైవర్లకు కిలోమీటరుకు కనీసం రూ. 20 చెల్లించాలని రోజుకు 8 గంటల పనివేళలు ఉండాలి. అదనపు సమయం పనిచేస్తే 'ఓవర్‌టైమ్' కింద అదనపు వేతనం ఇవ్వాలని గిగ్ వర్కర్ల డిమాండ్ చేశాయి. ప్రమాదాలు, అనారోగ్యం సంభవించినప్పుడు ఆదుకునేలా ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించాలి.తమ కష్టానికి తగిన విలువ ఇవ్వాలని, రోడ్లపై ప్రాణాలకు భరోసా కల్పించాలని గిగ్ వర్కర్లు గట్టిగా కోరుతున్నారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu