గేల్ "బ్యా (ఘా)టు" వ్యాఖ్యలు..మరో వివాదం

మైదానంలో బంతిని బలంగా బాదే వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్‌గేల్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. ఇప్పటికే ఎన్నో వివాదాల్లో కూరుకుపోయిన ఈ క్రికెటర్‌ తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ తరపున ఆడుతున్న గేల్ తాజాగా బ్రిటిష్ దినపత్రిక " ద టైమ్స్" మహిళా జర్నలిస్ట్ "చార్లెట్ ఎడ్వర్డ్స్‌"కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనది " చాలా పెద్ద బ్యాటు "అని నువ్వు "థ్రిసమ్‌"కు (ముగ్గురు కలిసి శృంగారానికి) పాల్పడ్డవా? అంటూ వెకిలిగా అడిగాడు. ఈ ఇంటర్వ్యూ ఇటు క్రికెట్ ప్రపంచంతో పాటు, అంతర్జాతీయంగాను దుమారం రేపుతోంది.

 

క్రిస్‌గేల్‌కు వివాదాలు కొత్త కాదు.. మైదానంలో పరుగుల సునామీ సృష్టించే ఈ విధ్వంసకర ఆటగాడు మంచి "కళా పోషకుడు" అని అతని వివాదాలు తెలియజేశాయి. ఎన్నోసార్లు కొత్త కొత్త అమ్మాయిలతో సరదాగా గడుపుతున్న ఫోటోలను గేల్ సోషల్ నెట్‌వర్క్‌లో పోస్ట్ చేసేవాడు. ఇది కాస్తా శృతి మించి అతని లీలలు ఒక్కొక్కటి బయటపడుతూనే ఉన్నాయి. అతనిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన "ఫాక్స్‌ స్పోర్ట్స్‌" రిపోర్టర్ "నెరోలి మెడోస్‌"తో నీ అందాన్ని చూస్తూ ప్రశ్న వినలేకపోయాను అంటూ వ్యాఖ్యానించాడంట. అంతటితో ఆగకుండా ట్విట్టర్ ద్వారా డిన్నర్‌కు రమ్మని తర్వాత డేటింగ్‌కు వెళదామని కోరాడంటూ ఆమె బయటపెట్టేసరికి క్రికెట్ ప్రపంచం ఉలిక్కిపడింది.

 

అంతేకాకుండా 2015 వరల్డ్‌కప్ సమయంలో వెస్టిండిస్ జట్టుతో పనిచేసిన ఒక ఆస్ట్రేలియన్ మహిళ గేల్ వెకిలి చేష్టలతో షాక్‌కు గురై తన అనుభవాలను మీడియా ముందుంచింది. ఆకలితో ఉన్న నేను శాండ్ విచ్ తీసుకోవడం కోసం డ్రెస్సింగ్ రూమ్‌కు వెళినప్పుడు క్రిస్ టవల్ కట్టుకుని ఉన్నాడు. అప్పుడు అతగాడు వెంటనే టవల్ తీసేసి "దీనిని చూసేందుకే వచ్చావా" అంటూ అభ్యంతరకరంగా మాట్లాడాడని వాపోయింది. ఐపీఎల్‌లో వరుసగా ఆడుతున్నప్పటికి సభ్యతగా వ్యవహరించిన క్రిస్‌గేల్ ఈ సారి ఇక్కడ కూడా తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు. జరిగిన ఘటన గురించి "ద టైమ్స్" జర్నలిస్ట్ చార్లెట్ ఎడ్వర్డ్స్ వెళ్లడించింది. తనది ప్రపంచంలోనే "పెద్ద బ్యాటు" అని దానిని ఎత్తడానికి నీకు రెండు చేతులు అవసరమవుతాయి అని అసభ్యంగా మాట్లాడాడు. ఎంతమంది నల్లజాతి పురుషులతో గడిపావని నన్ను గుచ్చి గుచ్చి అడుగుతూ..నువ్వెప్పుడైనా "థ్రిసమ్‌"కు పాల్పడ్డవా ? నువ్వు చేసే ఉంటావు అని వెకిలి వ్యాఖ్యలు చేశాడని చార్లెట్ వివరించింది. గత వివాదాలలోంచి చచ్చి చెడి బయటపడిన గేల్ తాజా వివాదం నుంచి ఎలా బయటపడతాడో..వేచి చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu