పాదయాత్రలో కాంగ్రెస్ పై నిప్పులు
posted on Nov 9, 2012 4:38PM
.png)
35వ రోజు పాదయాత్రలో చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చరిగారు. రైతులకు ఖర్చు పెరిగినా ఉత్పత్తులు కొనే నాథుడే లేడని అన్నారు. ప్రభుత్వ విధానాలతోనే రైతులు చితికిపోతున్నారని మండిపడ్డారు. వర్షాకాలంలో కరెంట్ కోతలున్నాయన్నారు. ఒక ఇంటికి రూ.7 వేలు బిల్లు వేస్తే పేదలు ఎలా కడతారని ప్రశ్నించారు. కరెంటు రాదు...బిల్లు భారం మాత్రం పెరిగిందని చంద్రబాబు చెప్పారు. కిరణ్ ఓ చేతకాని సీఎం అని, ప్రజలు కష్టాలు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. పిల్ల కాంగ్రెస్‌లో ఒకరు జైలులో ఉంటే, ఇంకొకరు పాదయాత్ర చేస్తున్నారని, మరొకరు ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. తెలంగాణపై కాంగ్రెస్ దొంగాట ఆడుతుందని విమర్శించారు. అన్ని పార్టీలూ కాంగ్రెస్‌లో కలిసిపోయేవే అని, ప్రజల కోసం మిగిలేదని టీడీపీ అని తేల్చి చెప్పారు.