అమరావతిలో న్యూక్లియర్ సిటీ నిర్మాణం... !
posted on Jun 8, 2016 12:03PM

ఏపీ రాజధాని అమరావతిలో న్యూక్లియర్ సిటీ నిర్మాణం జరుగుతోంది.. అగ్రరాజ్యమైన అమెరికాపై ప్రయోగించడానికి హైడ్రోజన్ బాంబులను ఏపీ ప్రభుత్వం తయారు చేయిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రికి కూడా తెలియని ఈ విషయాలు.. ఎవరికి తెలుసనుకుంటున్నారా.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.. పాక్ మీడియా. ఓ టీవి ఛానల్ లో చర్చ సందర్భంగా.. ఆ దేశానికి సంబంధించి ఓ వ్యక్తి అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో న్యూక్లియర్ సిటీ నిర్మాణం జరుగుతోందని, అక్కడ అమెరికాపై ప్రయోగించేందుకు హైడ్రోజన్ బాంబులను ఏపీ ప్రభుత్వం తయారు చేస్తోందని వ్యాఖ్యానించాడు. ఇక దీనికి వంతంగా పాక్ ప్రభుత్వం కూడా న్యూక్లియర్ సిటీ నిర్మాణంపై నిశిత పరిశీలన చేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తాని పాక్ చేసిన ఈ వ్యాఖ్యలు వింటే చంద్రబాబు కూడా ఆశ్చర్యపోతారేమో..