మథుర అల్లర్లు.. బయటపడిన మరో కొత్త విషయం..
posted on Jun 8, 2016 11:42AM

మథుర అల్లర్లలో రోజుకో సరికొత్త విషయం బయటపడుతోంది. 'స్వాధీన్ భారత్ వైదిక్ సత్యాగ్రాహి' అనే సంస్థ మథురలోని 280 ఎకరాల భూమిని ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. అయితే బయటకి అది ఆశ్రమంలా కనపడినా.. అక్కడ ఆయుధాల తయారీతో పాటు తన కార్యకర్తలకు ఆయుధ శిక్షణను ఇస్తుందన్న విషయం అందరిని అవాక్కయ్యేలా చేసింది. ఇప్పుడు మరో విషయం బయటపడింది. జవహర్ బాగ్ లో సోదాలు చేస్తున్న బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ కు అమెరికాలో తయారైన ఓ రాకెట్ లాంచర్ దొరికింది. ఈ అత్యాధునిక యుద్ధ పరికరాన్ని ఈ సంస్థకు ఎవరు సరఫరా చేశారన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా ఈ విచారణలో మరింత సంచలనం రేకెత్తించే అంశాలు వెలుగుచూసే అవకాశాలు ఉన్నట్టు పోలీసులు అభ్రిపాయపడుతున్నారు.
కాగా మథుర అల్లర్లలో ఎస్పీ సహా 24 మంది పోలీసులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.