బొగ్గు కుంభకోణంలో దూకుడు పెంచిన సిబిఐ
posted on Oct 15, 2012 2:06PM
బొగ్గు కుంభకోణంలో సిబిఐ దూకుడు పెంచింది. బొగ్గు కుంభకోణం వ్యవహారంలో మరో రెండు కేసులను నమోదు చేసింది. సిబిఐ ఆరు ప్రధాన నగరాలలో 16 ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ సహా విశాఖపట్నం, సాత్నా, జైపూర్, న్యూఢిల్లీ, రూర్కేలా నగరాలలోని పదహారు ప్రాంతాలలో సిబిఐ ఏకకాలంలో సోదాలు చేస్తోంది. హైదరాబాద్ వెంగళరావునగర్‌లో ఉన్న గ్రీన్ ఇన్‌ఫ్రా, రాణిగంజ్‌లోని కమలేష్ స్టీల్స్‌లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫోర్జరీ, చీటింగ్‌తో పాటు నికర ఆస్తుల విలువను ఎక్కువగా చూపి బొగ్గు గనులు కాజేశారని కమలేష్ స్టీల్స్, గ్రీన్ ఇన్‌ఫ్రాలపై ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు కంపెనీలే కాకుండా దేశవ్యాప్తంగా చాలా కంపెనీలపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి.