నేటికాలంలో చాలా మంది రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. అయితే మనం తీసుకునే ఆహారం ద్వారా అధికబీపీని సులువుగా తగ్గించుకోవచ్చు. హైబీపీని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలో తెలుసుకుందాం.

ఆధునిక జీవితంలో మనిషి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబ సభ్యలతో ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యోగ, వ్యాపార పనుల్లో చాలామంది క్షణం తీరిక లేకుండా గడుపుతూ ఆరోగ్యంపై అశ్రద్ధ చేస్తున్నారు. ఆహారం సరైన సమయంలో తీసుకోకపోవడం, సరైన డైట్ పాటించకపోవడం వల్ల అధిక రక్తపోటుకు సమస్యను ఎదుర్కొంటున్నారు. అధికరక్తపోటు శరీరంలో అవయవాలు, వాటి పనితీరుకు హాని కలిగిస్తుంది. దీంతో ఇతర వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే బీపీ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అధికరక్తపోటును నియంత్రించి తక్కువ బీపీ స్థాయిలను కలిగి ఉండాలంటే ఎలాంటి ఆహారంతోపాటు కొన్ని హెల్తీ డ్రింక్స్ తీసుకుంటే బీపీ స్థాయిలున తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం.

గూస్బెర్రీ అల్లం రసం:

మన శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే గుణం జామకాయలో ఉంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. అల్లంలో వాసోడైలేటింగ్ గుణాలు ఉన్నాయి. తద్వారా రక్తప్రసరణ సాఫీగా సాగి రక్తపోటు తగ్గుతుంది.

ధనియాల నీరు:

ధనియాలు మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉంటాయి.  అవి మన శరీరంలోని సోడియంను మూత్రం ద్వారా విసర్జిస్తాయి. ఇది ఆటోమెటిగ్గా రక్తపోటును తగ్గిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తాగడం అలవాటు చేసుకోండి.

బీట్‎రూట్, టమోటా రసం:

బీట్‌రూట్‌లో నైట్రేట్‌లు ఉంటాయి.  ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. నైట్రేట్ స్థాయిలు మన రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ పేరుకుపోవడానికి కారణమవుతాయి. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. టొమాటోలో లైకోపీన్, బీటా కెరోటిన్, విటమిన్ ఇ ఉన్నాయి, ఇది సమర్థవంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్ ఎలిమెంట్స్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ముల్లంగి రసం:

విటమిన్ సి సమృద్ధిగా ఉండటంతో పాటు, ముల్లంగిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి. ఇలా అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ ఒక గ్లాసు ముల్లంగి జ్యూస్ తాగడం అలవాటు చేసుకుంటే అధిక రక్తపోటు అదుపులో ఉండడమే కాకుండా గుండెకు ఎదురయ్యే సమస్యను దూరం చేస్తుంది.

-మీరు ఇప్పటికే రక్తపోటు సమస్యతో బాధపడుతున్నట్లయితే, ఖాళీ కడుపుతో రెండు జామకాయలు తినడం లేదా దాని రసం తాగడం అలవాటు చేసుకోండి.

-నల్ల ఎండు ద్రాక్షలో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ అల్పాహారానికి ముందు నాలుగైదు నానబెట్టిన నల్లని ఎండు ద్రాక్షలను తినడం అలవాటు చేసుకుంటే రక్తపోటు వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు.

-రోజూ అరగంట నడక సాధన చేయండి.

-కృత్రిమ చక్కెర అధికంగా ఉన్న ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఉప్పు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి