.webp)
మహిళలు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మూత్రం లీకేజ్ వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి సందర్బాలలో మహిళలు తమ మూత్రవిసర్జనను నియంత్రించుకోలేకపోతారు. దీనివల్ల అసౌకర్యం, ఇబ్బంది కలుగుతాయి. 40 ఏళ్ల తర్వాత మహిళల్లో దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మూత్రం లీకేజ్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వయస్సు పెరిగే కొద్దీ కటి కండరాలు క్రమంగా బలహీనపడటం జరుగుతాయని, ఇది మాత్రమే కాకుండా వైద్యుల పర్యవేక్షణ లేకుండా డెలివరీ వంటివి జరగడం కూడా ఈ సమస్యకు కారణం కావచ్చని మహిళా వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని చిట్కాలను వైద్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే..
మూత్రం లీకేజి ఇందుకే..
వయసు పెరిగే కొద్దీ కటి కండరాలు క్రమంగా బలహీనపడతాయి . ఇది గర్భాశయం, మూత్రాశయం, పురీషనాళం (ప్రేగు మార్గం) కు ఇచ్చే సపోర్ట్ ను బలహీనపరుస్తుంది. ఈ సపోర్ట్ బలహీనపడినప్పుడు, ఈ అవయవాలు వాటి స్థానం నుండి పక్కకు వెళ్లడం జరుగుతుంది. ఇది దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మూత్రం లీకేజ్ వంటి సమస్యలకు దారితీస్తుంది.
ఈ సమస్యకు మరో కారణం ఎక్కువ ప్రసవాలు జరగడం. ప్రతి ప్రసవంతో కటి కండరాలు బలహీనంగా, వదులుగా మారుతాయి. దీనివల్ల అవయవాలు సరైన సపోర్ట్ ను కోల్పోతాయి, మూత్రం లీకేజ్ వంటి సమస్యలకు దారితీయవచ్చు.
మూత్రం లీకేజి కాకూడదంటే ఇలా చేయాలి..
మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి. పోషకాహారం గురించి నిర్లక్ష్యంగా ఉండకూడదు. మల్టీవిటమిన్లు, కాల్షియం తీసుకోవడానికి ముందు వైద్యుల సలహా లేదా విటమిన్ల లోపాన్ని నిర్ధారించుకున్న తర్వాతే తీసుకోవాలి. ఆహారంలో ప్రోటీన్‌ను బాగా ఉండేలా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా కెగెల్ వ్యాయామాలు చేయాలి. సమస్య తీవ్రంగా ఉంట వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల మూత్రం లీకేజీ సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. లేదంటే మూత్రాన్ని నియంత్రించుకోలేక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు, గుడులకు వెళ్లినప్పుడు , శుభకార్యాలు వంటివి జరుగుతున్నప్పుడు, ప్రయాణాలలో ఉన్నప్పుడు ఇది చాలా దారుణమైన అనుభవాన్ని మిగులుస్తుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...




