నెయ్యి భారతీయులు ఎన్నో ఏళ్ళ నుండి ఉపయోగిస్తున్న నూనె పదార్థం. ఇది పాలనుండి తయారుకావడం వల్ల పవిత్రమైనదిగానూ, ఆరోగ్యకరమైనదిగానూ భావిస్తారు. కానీ నెయ్యిలో కేలరీలు ఎక్కువ ఉంటాయని, నెయ్యి  తింటే బరువు పెరుగుతారని, సన్నగా స్లిమ్ గా ఉండాలంటే నెయ్యి అవాయిడ్ చెయ్యాలని చెబుతారు. కానీ.. నెయ్యి వల్ల బరువు పెరగడం కాదు తగ్గుతారని చెబుతున్నారు ఆహార నిపుణులు. ఈ మాట వినగానే షాకింగ్ గా అనిపిస్తుంది.  అసలు ఇదెలా సాధ్యమనే డౌట్ కూడా వస్తుంది. నెయ్యి తింటే బరువు ఎలా తగ్గుతారో తెలుసుకుంటే..

 బరువు తగ్గడానికి ప్రయత్నించే చాలా మందిని  నూనె,  వెన్న,  నెయ్యి మొదలైన పదార్థాలను ఆహారం నుండి  తొలగిస్తారు. అయితే ఇది అస్సలు చేయకూడదు. నిజానికి బరువును డీల్ చెయ్యాలి అంటే సమతుల ఆహారం తీసుకోవాలి. ఇందులో నెయ్యి చాలా ప్రముకమైందని ఆయుర్వేదం చెబుతోంది. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు,  అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని జాగ్రత్తగా వాడితే బరువును చాలా సులువుగా తగ్గించుకోవచ్చు. నెయ్యి ఎలా వాడాలంటే..


నెయ్యిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే  కేలరీలు కూడా ఉంటాయి.అదనపు కేలరీల తీసుకోవడం నిరోధించడానికి ఆహారంలో నెయ్యి తీసుకోవడంలో  జాగ్రత్త తీసుకోవాలి. రోజూ కేవలం ఒక టీస్పూన్‌ నెయ్యి శరీరానికి కావలసిన కేలరీలనుకూడా అందిస్తుంది. దీని తరువాత బయటి నూనెలు, నూనె పదార్థాలు తినడం మానేస్తాం. కేలరీల భయంతో వాటికి దూరంగా ఉంటాం.   నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుంది తప్ప చెడు చేయదు.

చాలామంది పామాయిల్,  నూనె ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి అనారోగ్యకరమైన కొవ్వులకు కారణమవుతాయి. ఇవి చాలా తొందరగా ఆక్సీకరణం చెందుతాయి.  కానీ నెయ్యిలో ఆరోగ్యకరమైన సంతృప్త కొవ్వులు ఉంటాయి, ఇవి అధిక ఉష్ణోగ్రతల వద్ద ఆక్సీకరణం చెందే అవకాశం తక్కువగా ఉంటుంది.

నెయ్యిలో ఉండే సంతృప్త కొవ్వుల కారణంగా ఇది  ఎక్కువసేపు  శక్తిని అందిస్తుంది. వ్యాయామానికి ముందు ఒక స్పూన్ నెయ్యిని తీసుకోవం వల్ల శరీర పనితీరు, అవయవాల చురుకుదనం పెరుగుతుంది. అవయవాల చురుకుదనం, శరీర స్పందన రేటు పెరగడం వల్ల శరీరంలో చెడు కొవ్వులు కరుగుతాయి.

నెయ్యివల్ల బరువు తగ్గుతారని, ఇది మంచి కొవ్వులను కలిగి ఉంటుందని తెలుసుకున్నవారు నెయ్యిని ఎడాపెడా ఇష్టమొచ్చినట్టు వాడకూడదు. అతి సర్వత్రా వర్జయేత్ అనే మాటను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నూనెలు, నూనె ఆహారాలు తగ్గించుకుని పరిమిత మోతాదులో నెయ్యిని వాడితేనే బరువు తగ్గుతారు. దీని వల్ల కలిగే అదనపు ప్రయోజనం ఏమిటంటే ఒకవైపు బరువు తగ్గడం, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగి మంచి కొలెస్ట్రాల్ ఏర్పడటం. దీని వల్ల బరువు తగ్గడంతో పాటు గుండె జబ్బులు, కాలేయం, రక్తనాళాలు సేఫ్ అవుతాయి.  

                                                                    *నిశ్శబ్ద.