థైరాయిడ్ తగ్గాలంటే ఈ ఆసనాలు వేసి చూడండి!

ఒత్తిడి కారణంగా హైపోథైరాయిడిజం సమస్య వస్తుంది. థైరాయిడ్ స్థాయిలు పెరగడం అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. థైరాయిడ్ అనేది మెడలో ఉన్న ఒక చిన్న గ్రంధి, ఇది అనేక ముఖ్యమైన హార్మోన్లను స్రవిస్తుంది. ఈ హార్మోన్లు జీవక్రియ, శరీర ఉష్ణోగ్రత మరియు పెరుగుదలకు అవసరం. థైరాయిడ్ స్థాయి పెరగడం లేదా తగ్గడమనే రెండు సందర్భాలు  శరీరానికి హాని కలిగించవచేవే.. యోగా ఆసనాల ద్వారా థైరాయిడ్ గ్రంధి సమతుల్యతగా ఉండేలా చేసుకోవచ్చు. థైరాయిడ్ గ్రంధి వల్ల హార్మోన్లలో కలిగే మార్పులు మహిళలలో చాలా సమస్యలు తెచ్చిపెడతాయి. కింద చెప్పుకునే యోగా అసనాలు వేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

సేతుబంధాసనం

సేతువు ఆకారంలో భంగిమ ఉండటం వల్ల ఈ ఆసనాన్ని సేతుబంధాసనం అని  అంటారు. వెన్నెముకను బలోపేతం చేయడానికి ఈ యోగాసనం ఉపయోగపడుతుంది. సేతుబంధాసన సాధన ద్వారా థైరాయిడ్ లక్షణాలను తగ్గించవచ్చు. ఈ ఆసనం చేయడానికి వెల్లికిలా పడుకోవాలి.  మోకాళ్లను మీ భుజాల వెడల్పు నుండి కొంచెం దూరంగా వంచాలి. ఇప్పుడు, అరచేతులను తెరచి, చేతులను నేలపై నిటారుగా ఉంచి, శ్వాస తీసుకుంటూ, నడుమును పైకి ఎత్తాలి. ఊపిరి పీల్చుకుంటూ, తిరిగి పాత స్థితికి రావాలి.

భుజంగాసనం..
 
థైరాయిడ్ సమస్య నుండి ఉపశమనం పొందడానికి, భుజంగాసనం ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ భంగిమ గొంతు మరియు థైరాయిడ్‌ను ఉత్తేజపరచడంలో సహాయకరంగా పరిగణించబడుతుంది. సంస్కృతంలో భుజంగం అంటే పాము అని అర్థం.  భుజంగాసనంను కోబ్రా భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం వేయడానికి నేలపై పడుకోవాలి. అరచేతులను భుజం-వెడల్పు వేరుగా నేలపై ఉంచండి. ఇప్పుడు పీల్చేటప్పుడు ఛాతీని నేలపై నుండి పైకెత్తి సీలింగ్ వైపు చూడండి. ఇప్పుడు శరీరాన్ని నేలపైకి తీసుకురండి. ఈ యోగాను పునరావృతం చేయండి.

బిటిలాసనం.. 

థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు బిటిలాసనం వేయాలి. దీన్నే పిల్లి-ఆవు భంగిమ అని అంటారు. తులో రక్త ప్రసరణను కొనసాగించడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆసనం వేయడానికి, ముందుగా మణికట్టు మరియు మోకాళ్ల సహాయంతో జంతువు లాంటి భంగిమను వేయండి. లోతైన శ్వాస తీసుకోవాలి. ఆ తరువాత శ్వాసను మెల్లిగా వదలాలి. ఈ యోగాను ప్రతిరోజూ 10 నిమిషాల పాటు చేయాలి.

పశ్చిమోత్తాసనం..

తల మోకాళ్ళ వైపు, చేతులు పాదాల వైపు పోనిచ్చి వాటిని ఆనించడానికి  ప్రయత్నిచాలి. అయితే ఈ యోగాసనం వేసే ప్రారంభంలో తల మోకాళ్ళకు తగలకపోవచ్చు, చేతులు పాదాలకు అందకపోవచ్చు..  రోజు సాదన చేస్తే అది సాధ్యమవుతుంది. తిరిగి పడుకుని మళ్ళి మళ్ళి లేస్తూ ఈ ఆసనం చేయాలి. ఇలా కనీసం 5 నుంచి 20 సార్లు చేయాలి.

                                       ◆నిశ్శబ్ద.