సన్నబడాలనుకుంటున్నారా
" అర్జంటుగా సన్నబడాలి" అనుకుంటే, ఎం చెయ్యాలో తెలీక అవస్థాపడుతుంటాం. అయితే తీసుకునే ఆహారాన్ని తగ్గించటంలో పాటు క్రమం తప్పని వ్యాయామం మాత్రమే అధిక బరువును ఆడుతూ,పాడుతూ తగ్గిస్తుంది అంటున్నారు నిపుణులు. అయితే వ్యాయామం ద్వారా ఎన్ని కెలోరీలు ఖర్చు చేయొచ్చో తెలిస్తే చక్కగా ప్లాన్ చేయొచ్చు కదా! ఇదిగో ఆ వివరాలు చదవండి- పాటించండి- సన్నబడండి.
నడక: బరువు తగ్గాలనుకునే వారికీ అందరూ చెప్పే సలహా నడవమని నడక వాళ్ళ అంత లాభం ఉంటుందా అని అనుమానం వస్తుంటుంది కదా మనకి కాని నిజంగా చాలా లాభం వుంటుందట. ఎందుకంటే ఒక గంట నడిస్తే చాలు 300 కెలోరీలు ఖర్చవుతాయి. ఇంకాస్త ఓపిక ఉంటె కాస్త ఎత్తైన ప్రదేశాలవైపు నడిస్తే చాలు 400 దాకా కెలోరీలు కరిగిపోవడం ఖాయం.
ఇక నడుము కింద భాగం నాజుకుగా, ఉండాలంటే రోజు హాయిగా సైకిల్ తొక్కండి చాలు 350 కెలోరీలు వద్దన్నా కరిగిపోతాయి.400 వందలకు పైగా కెలోరీలు ఖర్చు కావాలంటే పరుగుకు మించిన వ్యాయామం లేదు.
అలాగే మంచి మ్యూజిక్ పెట్టుకుని నచ్చిన డ్యాన్స్ చేస్తే చాలు కెలోరీలు ఇట్టే కరిగిపోతాయంటే ఎవరు మాత్రం డ్యాన్స్ చేయకుండా ఉంటారు చెప్పండి. అలా డ్యాన్స్ చేస్తే చేస్తే గంటకు మూడొందల కెలోరీలకు పైగా ఖర్చవుతాయి. నచ్చిన మ్యూజిక్ పెట్టి సాల్సా, రాక్ఎన్రోల్ , బెల్లి డ్యాన్సింగ్ ఇలా వచ్చినది చేసేయండి.చాలు ఇక , స్కిప్పింగ్, స్పీడ్ జాగింగ్ , ఈత, ఆటలు, ఇవన్ని కూడా మానసిక ఆనందాన్నిచ్చెవె. వీటిలో గంటపాటు ఏ ఒక్కటి చేసినా 400 పైగా కెలోరీలు ఖర్చవటం ఖాయం. కాబట్టి కష్టంగా కాక ఇష్టంగా శరీరాన్ని కదిలించి బరువు తగ్గించండి అంటున్నారు నిపుణులు ఆలోచించండి ఆచరణలో పెట్టండి.
- రమ.