ఈ నాలుగు తింటే యవ్వనంగా ఉండటమే కాదు తెల్లజుట్టు నల్లగా మారిపోద్ది!
తెల్లజుట్టుతో కనిపించాలని ఎవరూ కోరుకోరు. కానీ వద్దంటే రాకుండా అది ఆగనే ఆగదు. కొందరిలో చిన్నవయసులోనూ, మరికొందరిలో ఒక వయసు దాటిన తరువాత తెల్లజుట్టు వచ్చే తీరుతుంది. పెద్ద వయసులో తెల్లజుట్టు వస్తే కాసింత కాంప్రమైజ్ అయ్యి దానికి హెన్నానో, హెయిర్ డై వంటివి పెట్టి కవర్ చేస్తారు. కానీ చిన్నవయసులోనే తెల్లజుట్టు వస్తేమాతం వయసు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తారు. రసాయనాలతో కూడిన హెయిర్ డైలు పెడితే మెదడు ఆరోగ్యానికే ప్రమాదం. అందుకే వివిధ రకాల షాంపూలు, హెయిర్ ఆయిల్స్ ప్రయత్నిస్తుంటారు. కానీ తెల్లజుట్టుకు నివారణకు చెయ్యాల్సింది నూనెలు పూయడం కాదు. లోపలినుండి జుట్టు నల్లబడేలా చెయ్యాలి. ఆ పనిని ఈ కింద చెప్పుకోబోయే నాలుగు ఆహారాలు సమర్థవంతంగా చేస్తాయి. అవేంటో తెలుసుకుని పాటించడమే తరువాయి..
ఉసిరికాయలు..
ఉసిరికాయలు నవంబర్, డిసెంబర్ నెలల్లో అందుబాటులోకి వస్తాయి. ఫిబ్రవరి, మార్చి నెలల వరకు దొరుకుతాయి. పచ్చి ఉసిరికాయలను మిక్సీ వేసి జ్యూస్ చేసుకుని దాన్ని కాసిన్ని నీళ్లలో కలుపుకుని తాగాలి. లేదంటే పచ్చి కాయలు అయినా తినచ్చు. ఉసిరికాయను ఎండబెట్టి పొడిచేసుకుని ఏడాది పొడవునా ఉపయోగించుకోవచ్చు. రోజూ ఉసిరికాయను తీసుకుంటూ ఉంటే తొందరలోనే తెల్లజుట్టు తగ్గిపోతుంది.
నల్ల ద్రాక్ష..
ద్రాక్షలో రెండు రకాలున్నాయి. వీటిలో నల్ల ద్రాక్ష తెల్లజుట్టుకు భలే మ్యాజిక్ చేస్తుంది. తాజా నల్ల ద్రాక్ష లేదా.. ఎండిన నల్లద్రాక్షను ప్రతిరోజూ తింటూ ఉంటే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. ఎండిన నల్ల ద్రాక్షను రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే పరగడుపున తినవచ్చు కూడా.
నల్లనువ్వులు..
నల్లనువ్వులు ఆడవాళ్లకు చాలా మంచిది. అమ్మాయిలు రజస్వల అయినప్పుడు. మహిళలు డెలివరీ అయిన తరువాత, ఆపరేషన్లు అయినవాళ్లు నల్లనువ్వులు తింటే నడుము బలపడుతుందని, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని చెబుతారు. ఇందులో కాల్షియం, ఐరన్ సమృద్దిగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య కూడా అస్సలుండదు.
కరివేపాకు..
కరివేపాకును నూనె తయారీలో ఎక్కువగా వాడతారు. కానీ కరివేపాకును ప్రతిరోజూ తింటూ ఉంటే జుట్టు భలే నల్లగా మారుతుంది. ఇందులో విటమిన్-ఎ, విటమిన్-బి, విటమిన్-సి, విటమిన్-బి12 మొదలైనవి మెండుగా ఉంటాయి. కరివేపాకుతో వివిధ రకాల వంటలు చేసుకుని తింటే రుచికి రుచి, తెల్లజుట్టు మటాష్.
*నిశ్శబ్ద.