చేతుల కొవ్వు తగ్గాలంటే ఈ ఆసనాలు వెయ్యాల్సిందే!

శరీరంలో ఏదో ఒక ప్రాంతంలో కొవ్వు చేరడం చాలా మంది విషయంలో కనిపిస్తున్న సమస్య. చాలామందికి పొట్ట, నడుము, పిరుదుల ప్రాంతాలలో కొవ్వు పేరుకుని ఉండటం గమనిస్తుంటాం. కానీ కొందరు మహిళల్లో చేతుల ప్రాంతంలో కొవ్వు పేరుకుని ఉంటుంది. ఈ కొవ్వు కరిగించడానికి కొందరు మార్కెట్లో దొరికే వివిధ ఉత్పత్తులు వాడటానికి ట్రై చేస్తారు. కానీ వీటి వల్ల ఫలితం పెద్దగా ఉండదు.  అయితే  యోగాసనాలు చేతుల కొవ్వు తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఇంట్లోనే చేతుల కొవ్వు తగ్గించుకోవడానికి ఏ ఆసనాలు వేయాలో తెలుసుకుంటే..

భుజంగాసనం..

భుజంగాసనం ను కోబ్రా పోజ్ అని కూడా అంటారు. రోజూ భుజంగాసనం వేసేవారు చేతుల కొవ్వును క్రమంగా తగ్గించుకోవచ్చు.  భుజంగాసనం దృష్టిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.  ఏకాగ్రత పెరుగుతుంది.  మరీ ముఖ్యంగా థైరాయిడ్ ఉన్నవారికి కూడా ఇది మంచి ఫలితాలు ఇస్తుంది.

ధనురాసనం..

చేతుల కొవ్వును తగ్గించడంలో మరొక ప్రభావవంతమైన ఆసనం ధనురాసనం.  దీన్ని బో పోజ్ అని అంటారు.  శరీరం విల్లులా వంచినట్టు ఉండే ఈ ఆసనం చేతుల కొవ్వును తగ్గించి చేతులకు, తొడలకు మంచి ఆకృతి ఇస్తుంది.  అంతేకాదు.. పొట్ట ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది.

చక్రాసనం..

చక్రాసనం నిలబడుకుని వేసే ఒక యోగాసనం.  చేతుల కొవ్వు తగ్గించడానికి భుజంగాసనంతో పాటు చక్రాసనం చాలా బాగా సహాయపడుతుంది. ఈ ఆసనాన్ని వీల్ పోజ్ అని కూడా అంటారు.  చక్రాసనం కేవలం చేతుల కొవ్వు తగ్గించడమే కాకుంా వీపును కూడా బలోపేతం చేస్తుంది.

పై మూడు ఆసనాలు ప్రతి రోజూ కొంత సమయం ప్రాక్టీస్ చేస్తుంటే కొన్ని రోజులలోనే చేతులు, కాళ్లలో కొవ్వు తగ్గడం జరుగుతుంది. అంతేకాదు.. పొట్ట,  వీపు  కూడా బలపడతాయి.  

                                        *రూపశ్రీ.