డిప్రెషన్, మరియు ఒత్తిడిని దూరం చేసే.. పవర్ఫుల్ ప్రాణాయామ చిట్కాలు.

మన దైనందిన జీవితంలో రోజువారీ పనులతో ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటుంటాం. ఉరుకులు పరుగుల జీవనశైలి కారణంగా మన శ్వాస క్రమం క్రమంగా తగ్గిపోయి చిన్నదైపోతుంది. ఈ బిజీ జీవితంలో మన శరీరానికి ప్రాణాధారమైన ఆక్సిజన్ అందడం చాలా ముఖ్యం. ప్రాణాయామం అనగా మనలో ఉన్న ప్రాణాన్ని శుద్ధి చేసుకోవడం మరియు శ్వాసను క్రమబద్ధీకరించుకోవడం అని అర్థం. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో ప్రాణాయామాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం, మన శరీరంలో ట్రిలియన్ల కొద్దీ కణాలు ఉన్నాయి. ఈ కణాలన్నింటికీ ప్రాణవాయువు లేదా ఆక్సిజన్ అత్యంత కీలకమైన ఆహారం. మనం తీసుకునే సరైన బ్రీతింగ్ టెక్నిక్స్ వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరిగి, శరీరంలోని ప్రతి కణానికి అది చేరుతుంది. దీనివల్ల కణాలు యాక్టివేట్ అయ్యి, శరీరంలో పేరుకుపోయిన కార్బన్ డై ఆక్సైడ్ మరియు హానికరమైన టాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి.

అయితే, నిరంతరం ఒత్తిడి మరియు ఆందోళనలో ఉండటం వల్ల మన శ్వాస వేగం తగ్గిపోయి కణాలకు తగినంత ఆక్సిజన్ అందదు. దీనివల్ల దీర్ఘకాలంలో కణాలు దెబ్బతింటాయి. మనం ఎంత మంచి పౌష్టికాహారం తిన్నప్పటికీ, శరీర కణాలకు ఆక్సిజన్ అందకపోతే మనం తినే ఆహారం సరిగ్గా అబ్సార్బ్ అవ్వదు. శరీరం అసిడిక్ నేచర్‌లోకి వెళ్లిపోయి పోషకాలు అందకుండా పోతాయి. ప్రాణాయామం చేయడం వల్ల నాడీ వ్యవస్థలోని పారాసింపథటిక్ నెర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఇది మన మెదడును, మనసును అత్యంత ప్రశాంతంగా ఉంచుతుంది. రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు ప్రాణాయామం చేయడం వల్ల రేసింగ్ థాట్స్ అన్నీ తగ్గిపోయి, గాఢమైన ప్రశాంతమైన నిద్ర సొంతమవుతుంది. సంక్లిష్టమైన టెక్నిక్స్ తెలియని వారు కూడా రోజువారీ జీవితంలో కేవలం ఐదు నుండి పది నిమిషాల పాటు కళ్ళు మూసుకుని డీప్ బ్రీడింగ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి మనం తినే ఆహారం, తాగే నీరు ఎంత ముఖ్యమో, మన శ్వాసను నియంత్రించే ప్రాణాయామం కూడా మన జీవితంలో అంతే ముఖ్యం.

 

 

Pranayama, breathing exercises for sleep, stress relief breathing, deep sleep techniques, Pranayama for anxiety, yoga breathing, insomnia relief, calm mind techniques.