ఆరోగ్యంతో పాటు వాతావరణాన్ని కలుషితం చేస్తున్న పొగాకుకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని మహావీర్ డెంటల్ రీసెర్చ్ ఆసుపత్రికి చెందినప్రముఖ దంత వైద్యులు డాక్టర్ బి చంద్రకాంత్ అన్నారు.డాక్టర్ చంద్రకాంత్ తెలుగు వన్ హెల్త్ తో మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులు సేవించడం వల్ల ప్రమాదకరమైన రోగాలు వస్తున్నాయని అన్నారు.ప్రజల అనారోగ్యానికి ప్రత్యక్షంగా పరోక్షం గా ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు.అందుకే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే పొగాకుకు దూరంగా ఉండాలనిడాక్టర్ చంద్రకాంత్ సూచించారు.దాదాపు ఈ మధ్యకాలం లో ఖైనీ,గుట్కా,పొగాకు ఉత్పత్తుల సేవనం పెరిగిపోవడం తో నోటి క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయం గా పెరిగిందని అన్నారు.ఈ మేరకు మహావీర్ డెంటల్ సెంటర్ లో దంత సంరక్షణ తోపాటు మ్యక్సిలో ఫేషియల్ సర్జరీ ద్వారా నోటి క్యాన్సర్ ను గుర్తించి శస్త్రచికిత్సలు చేశామని చంద్రకాంత్ వివరించారు.

భారత్ లో దాదాపు 27  కోట్ల ప్తజలు పొగాకు సేవిస్తున్నారని దీంతో పాటు దాదాపు 12 కోట్ల ప్రజలు సిగరెట్,చుట్ట,బీడీ వంటివి సేవిస్తున్నారని డాక్టర్ చంద్రకాంత్ పేర్కొన్నారు.భారత దేశంలో ప్రతిఏటా 12 లక్షల ప్రజలు మరణిస్తున్నారని గ్లోబల్ ఎడల్ట్ టొబాకో సర్వే 2౦16 -2౦ 17 రిపోర్ట్ ఆధారంగా భారత్ లో పొగాకు సేవిస్తున్న వారిలో 18.7 సంవత్సరాల వారు ఉన్నారు.మహిళల తో పోలిస్తే తక్కువ వయస్సు ఉన్న పురుషులు పొగాకు సేవించడం దురదృష్ట కరమనిడాక్టర్ చంద్రకాంత్ అన్నారు.ప్రపంచం లో ప్రతిఎటా సిగరెట్ ఉత్పదనల కోసం 6౦ కోట్ల చెట్లు నరికేస్తున్నారని 22 లీటర్ల నీరు వృదా చేస్తున్నారని పొగతాగడం వల్ల 8.4 కోట్ల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉత్పత్తి చేస్తున్నారని అన్నారు.దీనివల్ల వాతావరణానికి తీవ్ర నష్టం కలుగుతోందని అన్నారు.2౦22 సంవత్సరం లో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం యొక్క లక్ష్యం నినాదం పర్యావరణ పరిరక్షనే అని పిలుపు నిచ్చారు.

నిబందనల అమలు వైఫల్యం...

16 వ శతాబ్దం లో అక్బర్ శాసన కాలం నాటినుండే మొదటి సారి పోర్చుగల్ దేశస్తులు పొగాకు తీసుకోచ్చారు.జహంగీర్ శాసన కాలం లో పొగాకు నియంత్రించేందుకు పొగాకు పై పన్ను విధించారు. అయినప్పటికీ కొన్ని వందల స్మ్వత్సరాలు గడిచిన పొగాకు వ్యాపారం మూడు చుట్టలు ఆరు బీడిల సాగిపోతోంది పొగాకు వ్యాపారం నియంత్రణకు ఉక్కుపాదం మోపాలేక పోయారు.ఆరోగ్యం వాతావరణం రెండూ ప్రమాదం లో పడ్డాయి.

పొగాకు పలు రకాల క్యాన్సర్ కు కారణం అవుతోంది..

ప్రస్తుత పరిస్థితులలో అత్యధిక భాగం రోగాలకు కారణం పోగాకే దీనికారణంగా 25 రకాల రోగాలు దాదాపు 4౦ రకాల క్యాన్సర్లు వస్తాయని డాక్టర్ చంద్రకాంత్ అన్నారు.క్యాన్సర్ ప్రభావితమయ్యే వాటిలో నోరు,ముఖం,గొంతు,ప్రోస్టేట్,పొట్టలో క్యాన్సర్ ప్రధాన మైనవి.దీనితోపాటుబ్రెయిన్ ట్యూమర్ కూడా పొగాకు ప్రయోగం కారణంగా నే అని డాక్టర్ చంద్రకాంత్ స్పష్టం చేసారు.పొగాకు నుండి 5౦౦ హానికారక గ్యాస్ 7౦౦౦ రకాల రసాయన పదార్ధాలుఉత్పత్తి అవుతాయి.ఇందులో నికోటిన్ టన్ ప్రాధాన మైనవి.సిగరెట్ తో పోల్చినప్పుడు బీడీ తాగడం అత్యంత హానికారకం తేల్చారు.మనదేశం లో మహిళల ఆపేక్ష మేరకు పురుషులు పోగతాగుతున్నారని.ఎవరైనా పొగాకు కు లో బీడీ సిగరెట్ తగారంటే వారి ఊపిరి తిత్తులలో ౩౦%చేరుతుందని.దాదాపు దగ్గర దగ్గర వాతావరణం లో 7౦ % ఉంటుందని దానివల్ల కుటుంబ సభ్యులు పొగతాగే వారి పక్కనకూర్చోవడం వల్ల పోగ తాలూకు  ప్రభావం  ఉంటుందని అన్నారు అలాగే తాగేవారి కన్నా ఆపక్కన కూర్చున్న వారికి పై తీవ్ర ప్రభావం 
చూపుతుంది.దీనిని పెసివ్ స్మోకేర్స్ గా పేర్కొన్నారు.

ఊపిరి తిత్తులు పాడై అనుకోకుండా మరణిస్తారు ...

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మరణాలు5౦% ఉన్నాయని వాటికీ కారణం పోగాకే అని నిర్ధారించారు.పొగాకు నేరుగా తీసుకోవడం వల్ల నేరుగా ఊపిరి తిత్తులపై ప్రభావం చూపుతుందని రక్త ప్రసారం,బిపి,ఊపిరి తీసుకోలేక పోవడం .అదే పనిగా పొగతాగడం వల్ల బ్రోంకైటిస్ ,గుండెపోటు,నపుంసకత్వం మైగ్రైన్,జుట్టుతేల్ల బడడం,లేదా జుట్టు రాలిపోవడంఇతర సమస్యలు ఉన్నాయని డాక్టర్ చంద్రకాంత్ పేర్కొన్నారు.పొగాకు పండిస్తున్న దేశాలలో భారత్ దే ప్రధమ స్థానం.ప్రపంచం లో పొగాకు ఉత్పత్తి ప్రయోగాలలో రెండవ స్థానం.లో మనమే ఉన్నాం.దీనిప్రభావం చూసిన తరువాత ఉత్పత్తి,అమ్మకం పై నిషేధం విధించాలి దీనిపై  పర్ల మెంట్ లో పొగాకు నిషేధం చేసేందుకు చట్టం చేయాలన్న అంశం పై అనేక చర్చలు జరిగాయి. పొగాకు వ్యవసాయం చేస్తున్న వారిలో దాదాపు ౩ కోట్ల ప్రజలకు ఉపాది లభిస్తుందని అంచనా.భారాత దేశ ఆర్ధిక మంత్రిత్వ శాఖ 2౦15 -2౦16 గణాంకాల ప్రకారం.పొగాకు ఉత్పత్తుల ద్వారా ౩5,6౦౦ కోట్లు రూపాయలు అర్జిస్తుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.అయినప్పటికీ 1,౦4,5౦౦ కోట్ల పొగాకు వల్ల దుష్ప్రభావం వల్ల వస్తున్న పొగాకు నివారణకు ఖర్చుచేస్తున్నారని పొగాకు వల్లే తీవ్ర నష్టం కలుగుతోందన్నది వాస్తవం అందుకే పోగాకు ఉత్పత్తులు అమ్మకం పూర్తిగా నియమ నిబంధనలు అమలు చేయాలి.నిషేధం విధించాలి.అటు ఆరోగ్యం ఇటు వాతావరణానికి  కి మేలు చేస్తుంది

పిల్లల పై తీవ్రప్రభావం...

మహిళలు గర్భవతులుగా ఉన్నప్పుడు పొగాకు తాగడం వల్ల తీవ్రప్రభావం చూపుతుంది.దీనిపై అప్పుడే పుట్టిన శిశువు పై ప్రభావం చూపుతుంది.ఈ కారణంగానే శిశువు బరువు తగ్గ వచ్చు.గర్భావస్తలో ఉన్నప్పుడే  మరణించవచ్చు.పుట్టుక నుంచే శిశువు వివిదరకాల అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు.

ఆరోగ్యం తో ఆటలాడ కండి...

పొగాకు బీడీ సిగరెట్,గుట్కా,ఖైనీ,వంటి వాటికి కరోనా సంక్రమించే అవకాసం ఉంది కోరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పొగాకు తాగడం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.కోరోనా విస్తరించడానికి అధిక సంఖ్యలో తీవ్ర అనారోగ్యం పలవ్వడానికి పొగాకు సేవించడం నుండి దూరంగా ఉండండి.ఇంటి నుండి బయటికి వెళ్ళే టప్పుడు మాస్క్ ను తప్పని సరిగా వాడండి.ఇది శ్వాస నాళాల ద్వారా విస్తరించే రోగం మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు వాయు కాలుష్యం నుండి రక్షిస్తుంది.పొగాకు సేవించడం ఆరోగ్యానికి హానికరం అని మీకు తెలిసినా పొగాకును విడి చి పెట్టేందుకుమీరు మీడాక్టర్ సలహా తీసుకోండి.నికోటిన్ లేని నికోటిన్ రేప్లసే మెంట్ తెరఫీ సహకరిస్తుంది.మీరు యోగా ప్రాణాయామం,పొగాకు బీడీ,సిగరెట్ వదలడం లో సహాయ పడుతుంది.మీరు పొగాకు విదిపెట్టాలని మీరు భావించినప్పుడు కొన్ని యాప్స్ మీకు సహక రిస్తాయి.