కోరోనా వైరస్ అనేకారూపలలో తన విశ్వరూపాన్ని చూపిస్తోంది టమాటా పాక్స్,మంకీ పాక్స్ నేడు 21 దేశాల్లో తన ప్రతపాని చూపిస్తోంది. యూరోప్ దేశాలలో విస్తరిస్తున్న మంకీ పాక్స్ నేడు ప్రాణాల కు హానికలగక పోవడం కొంత మేర ఉపసమనం కలిగిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. కోరోనా తరువాత ప్రాణాంతక మైన కాంగో హేమరేజ్ ఫీవర్ ప్రాణాలు తీసేస్తోందని సమాచారం.ఈ మేరకు కాంగో హేమరేజ్ ఫీవర్ జ్వరం ముక్కుద్వారా లేదా శరీరం లోని ఇతర భాగాలలో ఎక్కడైనా రక్త స్రావం అయినా ఈ రోగులు మరణిస్తున్నారని తెలుస్తోంది. ప్రపంచం లో కోరోనా ఇంకా విషం చిమ్ముతూనే ఉంది.ఇప్పుడు మధ్య పశ్చిమ ఆశియా దేశాలలో ముఖ్యంగా ఇరాక్ లో ఈ మధ్య కాలం లో ఒక కొత్త రోగం త్వరగా విస్తరిస్తోంది.

కాంగో హెమరేజిక్ ఫీవర్లక్షణాలు...

దీనిలక్షణాలు చూసినప్పుడు రోగికి తీవ్ర జ్వరం,ముక్కు నుండి రక్తం కారడం. ఈ వ్యాదిద్వారా రోగుల ముక్కునుండి రక్తస్రావం కారణంగా మరణిస్తున్నారని తెలుస్తోంది. మీడియాలో వస్తున్నసమాచారం ప్రకారం ఈ వ్యాధిబారిన పడ్డ దాదాపు 19 మంది మరణించారు. ఈ రోగం విస్తరించిన గ్రామీణ ప్రాంతాలాలో ఆరోగ్య కార్యకర్తలు పిపి ఇ కిట్లను ధరించి రక్తశ్రావం తో వస్తున్న జ్వర పీడితులకు క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫెఅవేర్ అని పేరు పెట్టారు. జంతువుల ద్వారా మానవులకు త్వరగా విస్తరిస్తోమ్దని ఇరాక్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

వ్యాధి విస్తరణ...

క్రిమియన్ కాంగో హేమరేజ్ వ్యాధి కీటకాలు కాటు వేయడం వల్ల విస్తరిస్తుంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సమాచారం మేరకు జంతువులకు క్రిమియన్ హేమరేజ్ వైరస్ జంతువుకు సోకినా,ఈ వ్యాధి సోకిన జంతువు మాంసము తిన్న ఈ వ్యాధి బారిన పడతారని రోగి శరీరం లోపల బయట రక్త్గా స్రావం 
జరుగుతుంది. దక్షిణ ఇరాక్ లో విజ్రుం భిస్తున్న కేసులు ఇరాక్ ఆరోగ్య శాఖ అధికారులు వివరాల ప్రకారం గతసంవత్సరం లో ఈ వ్యాధి వేళ్ళ మీద లెక్కించ దగిన స్థాయిలో మాత్రమే ఉన్నాయని ఇప్పుడు ఈ వ్యాధి దున్నపోతులు,ఆవులు,మేకల ద్వారా వ్యాపిస్తుందని నిపుణులు అంటున్నారు.