చక్కగా నిద్రపోతే రచయిత అవుతారట! నిజం నిద్రపోతే టైం వేస్ట్ అయిపోతుంది అనుకునే వాళ్ళ ఆలోచన తప్పు అంటున్నారు, నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు.
నిద్ర సామర్ధ్యాన్ని, నేర్చుకునే తత్వాన్ని,జ్ఞాపక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు. వీరు. మన మెదడులో ఒకదానికొకటి సంబంధం లేని ఆలోచనలు ఎన్నో వస్తుంటాయి, ఆ ఆలోచనలని ఒక దానితో ఒకటి కలిపి ఓ చక్కటి ' సృజనాత్మక ' ఆలోచనగా తీర్చిదిద్దే ప్రక్రియ నిద్రలోనే జరుగుతుందట. నిజానికి ఒక వ్యక్తి కి ఒక ఆలోచన వచ్చిన తర్వాత అది ' సృజనాత్మక ' రూపం పొందేముందు మద్యలో కొంత ' ఇంక్యుబేషన్' పిరియడ్ వుంటుంది. ఇదంతా నిద్రలో సాగుతుంది. చాలా మంది నిద్ర లేచిన వెంటనే మంచి ఆలోచనలతో చక్కగా సృజనాత్మకంగా రాయగలుగుతారట, అయితే ప్రత్యేకంగా ఆ విషయన్ని గుర్తించారట వారు.
అందుకే ఈసారి నిద్రలేచిన వెంటనే ఓ 10 నిముషాలు ఓ చోట కూర్చుని మీ ఆలోచనలని గమనించండి అంటున్నారు, పరిశోధకులు. మంచి రచయిత, కవి ,కావాలంటే చక్కగా కంటినిండా నిద్రపోండి లేచాకా పెన్ను పట్టండి...
...రమ