పూరీ జగన్నాధ స్వామి ఆలయంలో ప్రసాదం మట్టిపాత్రలలోనే వండబడుతుంది, మట్టిపాత్రలోనే అందించబడుతుంది. ఎందుకంటే మట్టి పరమపవిత్రమైనది. శరీరం తగులబెట్టినప్పుడు మిగిలేది 20 గ్రాముల మట్టిమాత్రమే. అందులోనే 18 రకాల మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి. దాన్నే మనం బూడిద అంటాము. ఈ వైజ్ఞానిక విషయం అక్కడి పూజారులకు తెలియకపోవచ్చు. ఎందుకంటే వారు సైన్స్ చదువలేదు కాబట్టి. అయినా కూడా శాస్త్రవేత్తలయినవారు ఎన్నో సంవత్సరాలు పరిశోధించి తెలుసుకునే విషయం వారికి తెలియకపోయినా వారు ఆచరిస్తున్నారు. పవిత్రమైన ఆలయంలో భగవంతుని ప్రసాదం కూడా అంతే పవిత్రమైన మట్టి పాత్రలోనే వండి సమర్పించాలి అని మాత్రం తెలుసు. 

ఒకసారి కొందరు ఈ ప్రసాదాన్ని తీసుకుని భువనేశ్వర్ లోని C.S.I.R. లేబరేటరీ అంటే (కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్) రీజనల్ రిసర్చ్ లేబరేటరీలో పరిశోధించమని అడిగారు.  వారు దీనికి చాలా సమయం అంటే దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది అన్నారు. అయినా దానికి కావల్సిన పనిముట్లు మావద్దలేవు. మీరు ఈ ప్రసాదాన్ని డిల్లీ తీసుకువెళ్ళి టెస్ట్ చేయించుకోండి అన్నారు. 

మళ్ళీ అక్కడ నుండి డిల్లీదాకా తీసుకెళ్తే అప్పటిలోపు అది పాడవుతుంది కదా అని వాళ్ళకు డౌటొచ్చింది.  అదే విషయం అక్కడి శాస్త్రజ్ఞులకు చెబితే..  అక్కడి శాస్త్రజ్ఞులు ఇలా అన్నారు..  పూరి ఆలయంలోని ప్రసాదం మట్టిపాత్రలో వండబడుతుంది కాబట్టి, ఇది పాడవ్వదు అని చెప్పారు. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. మట్టిపాత్రలో వండే ఆహారం ఎంత విలువైనదో అనే విషయం. అయితే భునేశ్వర్ నుండి డిల్లీకి వెళ్ళాలంటే సుమారు 36 గంటల సమయం పడుతుంది. అయినా తీసుకెళ్ళి అక్కడ రీసెర్చ్ చేయించిన తరువాత  రిపోర్ట్ వచ్చింది. ఈ పదార్థంలో ఒక్క మైక్రో న్యూట్రియన్స్ కూడా తగ్గలేదు అని వారన్నారు. వెంటనే ప్రెషర్ కుక్కర్లో వండిన పదార్ధాన్ని కూడా టెస్ట్ చేయించారు. దానికి  వచ్చిన రిపోర్ట్ కేవలం 13 శాతం మాత్రమే న్యూట్రియన్స్ ఉన్నాయి. 87 శాతం న్యూట్రియన్స్ దెబ్బతిన్నాయి, లోపించాయి.

అంతేకాదు మట్టిపాత్రలో వండిన పదార్థానికి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది మన భారతీయ సంస్కృతీ సంప్రదాయం కనుక మన పూర్వీకులు ఈ సంప్రదాయం ప్రకారం జీవించినంతవరకు వారికి కళ్ళజోడు రాలేదు. జీవితాంతం వరకు పళ్ళు ఊడిపోలేదు. మోకాళ్ళ నొప్పులు డయాబెటీస్ వంటి సమస్యలు రాలేదు. శరీరానికి కావల్సిన నూట్రియన్స్ సక్రమంగా అందుతుంటే జీవితాంతం మన అన్ని పనులు మనమే ఎవరిమీద ఆధారపడకుండా జీవించగలం. అది ఒక్క మట్టిపాత్రలో వండిన ఆహారం తినడం వలన మాత్రమే సాధ్యమవుతుంది.

అందుకనే భారతదేశం నేలలో అల్యూమినియం తయారీకి కావల్సిన ముడిసరుకు ఎంత ఉన్నప్పటికీ, మనవారు మట్టి వస్తువులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇంతగా మనకి మట్టిపాత్రలు తయారుచేసే కుమ్మరివాళ్ళు మనకి ఎంత గౌరవనీయులో కదా. ఏమట్టి కుండగా పనికివస్తుందో ఎలాంటి మట్టితో వంటపాత్రలు చేయవచ్చో గుర్తించి ఏ యూనివర్శిటీలో చదువుకోకుండానే మనకి ఇంత గొప్ప సేవచేసి మన ఆరోగ్యాన్ని అందిస్తున్నారు కుమ్మరివారు.  మనం కుమ్మరి వారిని ప్రోత్సహించి వారికి భవితను ఇవ్వాలి. ఫ్రిజ్ లు, కుక్కర్ లు  ఉన్నాయి కదా అని మట్టి పాత్రలను దూరం పెడితే మనకు మిగిలే న్యూట్రియన్స్ సున్నానే…  ఆరోగ్యంగా జీవితాంతం బ్రతకాలంటే గాలి, సూర్యరశ్మి తగిలేలాగా ఆహారం వండుకోవాలి.  దానిలో అత్యుత్తమమైన పాత్ర మట్టిపాత్ర.. లోనే వండాలి.

                                      ◆నిశ్శబ్ద.