మన శరీరంలో ఆక్సిజన్, హార్మోన్లు, విటమిన్లు, మినరల్స్, ఇతర ముఖ్యమైన పోషకాలు రక్తం ద్వారానే శరీర అవయవాలకు రవాణా అవుతాయి. అయితే విషపూరిత కణాలు రక్తంలో కలవడం వల్ల బ్లడ్ పాడవుతుంది. ఫలితంగా రక్తం పనితీరుపైనా ప్రభావం పడుతుంది… విషపూరిత పదార్థాలను లేదా కణాలను మనం నియంత్రించాలి. లేదంటే అవి వివిధ వ్యాధులకు కారణమవుతాయి.

◆రక్తం ఎందుకు శుద్దిగా ఉండాలంటే..

శరీరంలోని అన్ని అవయవాలు, టిష్యూ కణాలు రక్తంతో అనుసంధానం అయి ఉంటాయి. బ్లడ్ పాడవడం వల్ల గుండెపోటు,  పీసీఓడీ, మధుమేహం, ఊబకాయం, రక్త పోటు, బ్లడ్ క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి. వాటి నుంచి బయటపడాలంటే రక్తం శుద్ధిగా ఉండటం అవసరం.

◆మన రక్తం పరిశుభ్రంగా లేదని ఎలా తెలుసుకోవచ్చు?

అపరిశుభ్రమైన రక్తం యొక్క లక్షణాలు

చర్మ సమస్యలు

ఎక్కువగా జుట్టు రాలిపోవడం

ఆకలి మందగించడం

అతిగా నిద్రపోతున్న ఫీలింగ్

ముదురు పసుపు రంగులో మూత్రం

రక్తస్రావం అయ్యే వ్యాధులు

◆కారణమేమిటంటే..

రక్తం విషతుల్యం కావడానికి మూల కారణం 'పిత్త దోషం'(శరీరంలో వేడి), ప్రతికూల భావోద్యేగాలని ఆయుర్వేదంలో ఉంది.

◆రక్తాన్ని అపరిశుభ్రంగా మార్చే అలవాట్లు

కార్బోహైడ్రేటెడ్ డ్రింక్స్, చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, వేపుడు పదార్థాలు, ఉప్పు అధికంగా ఉన్న లేదా స్పైసీగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల రక్తం అపరిశుభ్రంగా మారుతుంది..

ఫుడ్ కాంబినేషన్ సరిగ్గా లేకపోవడం కూడా ఇందుకు ఓ కారణమే.. ఉదాహరణకు ఉప్పగా ఉండే స్నాక్స్ తింటూ టీ తాగడం, పిండిలో ఉప్పు, పాలు కలపడం. యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడటం, పొగ తాగడం, మందు సేవించడం, సమయానికి తినకపోవడం, నిద్ర విషయంలో రాజీ పడడం ఇందుకు ప్రధాన కారణాలు.

టాక్సిక్ ఓవర్లోడ్ను తగ్గించుకోవాలి

రక్తాన్ని అపరిశుభ్రంగా మార్చే అలవాట్లకు దూరంగా ఉండడం వల్ల టాక్సిక్ ఓవర్లోడ్ను తగ్గించుకోవచ్చు"

అనుసరించాల్సిన మార్గాలు

15 రోజులకు ఒకసారి ఉపవాసం

డిన్నర్ను రాత్రి 7 గంటలలోపు తినాలి

ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. తగినన్ని నీళ్లు తాగాలి

ఉప్పు వినియోగం తగ్గించాలి. చురుకుగా ఉండాలి.

వేపాకు

వేప శరీరాన్ని కూల్గా ఉంచుతుంది. ఇది రక్తాన్ని సహజంగా శుద్ధి చేస్తుంది. చర్మ సమస్యలకు చక్కని పరిష్కారంగా ఉంటుంది. వరుసగా ఐదు రోజుల పాటు పరగడుపున 4-5 వేపాకులను తినాలి

◆ఆరోగ్యకరమైన రక్తానికి కావాల్సిన ఆహారం

క్యారెట్లు, బీట్రూట్లు, సొరకాయ, చిన్న పొట్లకాయను రోజూవారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆకు కూరలు, ముఖ్యంగా రుచిలో వగరుగా ఉండే ఆహార పదార్థాల వల్ల రక్తంలో విషతుల్యమైన కణాలను తొలగించవచ్చు. దానిమ్మ, మామిడి పండ్లు. అల్ల నేరేడు, ఉసిరి వంటి పండ్లు తరచుగా తింటూ ఉండాలి.

ఇవన్నీ పాటిస్తే మీ రక్తాన్ని సులువుగా శుద్ధి చేసుకోవచ్చు.

                                       ◆నిశ్శబ్ద.