మనకు తక్కువ ధరలో.. అందుబాటులో ఉండే కూరగాయల్లో ముల్లంగి ఒకటి. నీటి శాతం అధికంగా ఉన్న ముల్లంగి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, చలికాలంలో ముల్లంగిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది, జలుబు, దగ్గు వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ముల్లంగి తినడం వల్ల గుండె జబ్బులు కూడా తగ్గుతాయి. కానీ చాలా మంది ముల్లంగి తినడం మానేస్తారు. రుచి నచ్చకో.. వాసన నచ్చకో.. మరింకేదో కారణం చెప్పుకుని ముల్లంగికి దూరం ఉంటారు. కొందరు ముల్లంగి తిన్న తర్వాత గ్యాస్ వస్తుందని అంటారు. దీని వల్ల కొన్నిసార్లు అందరి ముందు ఉన్నప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. పచ్చి ముల్లంగి తినడం కొందరికి అలవాటు. ఇతర రాష్ట్రాలలో మనం దోసకాయను తిన్నట్టు, ముల్లంగిని తింటారు.
ముల్లంగిని తిన్న తర్వాత చాలా మంది కడుపు నొప్పి అని కూడా ఫిర్యాదు చేస్తారు. ఆయుర్వేదం ప్రకారం.. ఈ రకమైన సమస్య ముల్లంగి తినడం వల్ల కాదు, ముల్లంగిని తప్పుగా తీసుకోవడం వల్ల వస్తుంది. ముల్లంగి తినడానికి సరైన సమయం తెలుసుకోవాలి. నచ్చినప్పుడు నచ్చినవిధంగా ముల్లంగి వండుకుని తినడం, తరువాత దాన్ని నిందించడం కంటే.. ముల్లంగిని తినడానికి సరైన మార్గం ఏంటో తెలుసుకుంటే బెటర్.
ముల్లంగి తినడానికి సరైన సమయం ఏది?
ముల్లంగిని ఎప్పుడూ ఖాళీ కడుపుతో తినకూడదు. రాత్రి భోజనంలో కూడా ముల్లంగిని తినకూడదు. తరచుగా చాలామంది ముల్లంగిని ఆహారంతో పాటు సలాడ్‌గా తింటారు, కానీ వండిన ఆహారంతో పచ్చి కూరగాయలను తినకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. అందుకే ముల్లంగిని అల్పాహారం తర్వాత లేదా మధ్యాహ్నం భోజనానికి ముందు తినాలి. కావాలంటే లంచ్ డిన్నర్ మధ్య సమయంలో ముల్లంగిని తినవచ్చు. ఈ సమయంలో ముల్లంగి తినడం వల్ల శరీరానికి ముల్లంగిలోని అన్ని పోషకాలు అందుతాయి. జీర్ణక్రియ కూడా బాగుంటుంది.
ముల్లంగిని తినడానికి సరైన మార్గం తెలుసా..
పచ్చి ముల్లంగిని తింటుంటే, దానితో పాటు ఇతర పచ్చి కూరగాయలను చేర్చుకోవాలి. ఉదాహరణకు దోసకాయ, టొమాటో, క్యారెట్ మొదలైన వాటిని మిక్స్ చేసి సలాడ్ లాగా తినవచ్చు.
ముల్లంగిని కొనుగోలు చేసేటప్పుడు, అతిగా పండిన ముల్లంగిని కొనకూడదు. ఈ రకమైన ముల్లంగిని తినడానికి బదులుగా, సన్నగా, చిన్నగా లేతగా ఉన్న ముల్లంగిని తీసుకోవాలి.
ముల్లంగి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, కాబట్టి ముల్లంగిని తినే సమయంలో ఒకే చోట కూర్చోకూడదు. ఏవైనా చిన్న చిన్న పనులు చేస్తుండాలి.
ముల్లంగిని పొట్టు తీసి అందులో నల్ల ఉప్పు కలిపిన తర్వాత తింటే మంచిది.
ముల్లంగిని ఎవరు తినకూడదు?
శరీరంలో నొప్పి ఎక్కువగా ఉంటే ముల్లంగిని తినకూడదు. శారీరక శ్రమ చేయని వారు కూడా ముల్లంగికి దూరంగా ఉండాలి. అలాంటి వారు ముల్లంగి తినడం వల్ల కడుపు నొప్పి లేదా గ్యాస్ సమస్య పెరుగుతుంది.
ముల్లంగి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..
చలికాలంలో రోజూ ముల్లంగి తినడం వల్ల దగ్గు మరియు జలుబు సమస్యను దూరం చేసుకోవచ్చు.
ముల్లంగిని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.
జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ముల్లంగి ప్రయోజనకరంగా ఉంటుంది.
ముల్లంగి రక్తంలో చక్కెరను కూడా చాలా వరకు తగ్గిస్తుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారికి మంచిది.
◆నిశ్శబ్ద