ఆఫీసులకు వెళ్లే మహిళలు చురుగ్గా ఉండాలంటే.. తప్పనిసరిగా చేయాల్సిన వ్యాయామాలు!


 ఈ రోజుల్లో మహిళలు ఇంటి పనులు చేస్తూ, అటు ఆఫీసులకు వెళుతూ రెండు పడవల ప్రయాణం చేస్తుంటారు.  చాలా మంది మహిళలకు తమ కోసం తాము  సమయం కేటాయించుకోవడం  చాలా కష్టంగా ఫీలవుతుంటారు.  అయితే మహిళలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.  మరీ ముఖ్యంగా  ఆఫీసుకు వెళ్లే మహిళలు తప్పకుండా కొన్ని వ్యాయామాలను ప్రతిరోజూ చేయాలని మహిళా ఆరోగ్య సంరక్షణ నిపుణులు చెబుతున్నారు.  పని చేస్తున్నప్పుడు శరీరం అసౌకర్యంగా అనిపించడం,  కాళ్ల కీళ్లు,  ఎముకలు పట్టుకుపోయినట్టు బిగుతుగా మారడం వంటివి ఎదురవుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజూ వ్యాయామాలు చేయాలని అంటున్నారు.  మహిళలకు ఎంతగానో సహాయపడే ఆ వ్యాయామాలు ఏమిటో తెలుసుకుంటే..

షోల్డర్ రొటేషన్..

ఉద్యోగానికి వెళ్ళే మహిళలు ఇంట్లో కొంత సమయం కేటాయించి షోల్డర్ రొటేషన్ స్ట్రెచింగ్  వ్యాయామాలు చేయాలి. ఇవి భుజాలను బలోపేతం చేయడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇవి వెనుక కండరాలను కూడా బలోపేతం చేస్తాయి.

హిప్ రొటేషన్..

హిప్ రొటేషన్ స్ట్రెచింగ్ వ్యాయామాలు కూడా చేయవచ్చు. ఇది  ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.  దీన్ని రోజూ చేస్తే,  శరీరం రోజంతా చురుకుగా ఉంటుంది. అలసిపోయినట్లు అనిపించదు

యాంగిల్ రొటేషన్..

మీరు ఇంట్లో ప్రతిరోజూ  యాంగిల్ రొటేషన్ ను  కూడా సాధన చేయాలి. ఇది  శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. సాగదీయడం  చీలమండలలోని దృఢత్వాన్ని సడలించడానికి ,  శరీరాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

సైడ్ బెండ్స్..

 రోజూ సైడ్ బెండ్స్ కూడా చేయవచ్చు.  నడుము వైపులా సాగినట్లు అనిపిస్తుంది, వీపు మరింత నిటారుగా  మారుతుంది.  వెన్నెముకను బలోపేతం చేయడానికి  కూడా సైడ్ బెండ్స్  చేయవచ్చు.  డెస్క్ వద్ద  పనిచేసే వారికి ఇది చాలా మంచి వ్యాయామం.

కాఫ్ రైజెస్..

 కాఫ్ రైజెస్ కూడా రోజూ ప్రాక్టీస్  చేయవచ్చు. వీటిని చేయడం వల్ల  కండరాలు , చీలమండలు బలపడతాయి.  వీటిని వార్మప్ గా కూడా చేయవచ్చు.


                                  *రూపశ్రీ.