ఆహారం శరీరానికి చాలా మేలు చేస్తుంది.  సరైన ఆహారం తీసుకుంటే ఎలాంటి జబ్బులు అయినా తగ్గుతాయని ఆయుర్వేదం కూడా చెబుతుంది. అందుకే సీజన్ కు తగ్గట్టు ఆహారంలో మార్పులు చేసుకోవాలని చెబుతుంటారు.  చలికాలంలో సాసువ ఆకు లేదా ఆవాల ఆకు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటారు. ఆవాలు చెట్టు నుండి లభించినప్పుడు దాని మీద పొట్టు కూడా తీయకుండా పసుపు రంగులో ఉంటే వాటిని సాసువలు అంటారు.  ఇక ఆవాల గురించి భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు.  ఈ ఆవాలు పండే మొక్కల ఆకులను ఆహారంలో తీసుకుంటారు.  ఇప్పట్లో చాలా మంది ఈ ఆకుల వినియోగం తగ్గించారు కానీ పెద్దల కాలం నాడు ఈ ఆకులను వంటల్లో వినియోగించేవారు.  ఆవాల చెట్టు ఆకులను ఆహారంలో తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటే..

పోషకాలు..

ఆవాల మొక్క ఆకులలో  విటమిన్-ఎ,  విటమిన్-సి, విటమిన్-కె, ఐరన్,  కాల్షియం,  మెగ్నీషియం, ఫైబర్, సోడియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ శరీరానికి చాలా మేలు చేస్తాయి.

ప్రయోజనాలు..

ఆవాల మొక్క ఆకులను ఆహారంలో తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి.  చలికాలంలో సహజంగానే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.  జీర్ణక్రియ మెరుగ్గా ఉండటానికి ఆహారంలో ఆవాల మొక్క ఆకులు తీసుకోవాలి. ఈ ఆకులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఇది మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మోషన్ సాఫీగా జరగడంలో సహాయపడుతుంది.

ఆవాల మొక్క ఆకులలో అమైనో ఆమ్లాలు,  ఫైబర్ సహా అనేక పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.  చలికాలంలో ఈ ఆకులు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  శరీరలో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉండదు.

ప్రోటీన్లు, విటమిన్లు సమృద్దిగా ఉండటం వల్ల ఆవాల మొక్క ఆకులు తింటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు రాలే సమస్య తగ్గడం నుండి జుట్టు ఆరోగ్యంగా పెరగడం వరకు అన్ని రకాలుగా జుట్టుకు మేలు చేస్తుంది.

ఆవాల మొక్క ఆకులలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని ఆహారంలో తీసుకుంటే ఉంటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తుంది. ఈ  కారణంగా ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

డయాబెటిస్ ఉన్న వారికి ఆవాల మొక్క ఆకులు చాలా మేలు చేస్తాయి. ఆవాల మొక్క ఆకులు తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది.  శరీరంలో రక్తహీనత తొలగిపోతుంది. ఇది వేడి చేసే గుణం కలిగి ఉంటుంది కాబట్టి ఈ ఆకులు  ఆహారంలో తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది.


                                  *రూపశ్రీ.