భారతదేశం కళలకు పుట్టినిల్లు అని అంటారు. అంతేకాదు..  భారతదేశం ప్రాచీన సంపదకు కూడా నిలయం. ఇక్కడ కళల నుండి వైద్యం,  సంస్కృతి,  అలవాట్లు,  సంప్రదాయాలు, పద్దతులు.. ఇలా చాలా విషయాలలో భారతదేశం గొప్పదే.. ముఖ్యంగా భారతదేశ ఆయుర్వేదానికి ప్రపంచ వ్యాప్తంగా కూడా పేరు, గుర్తింపు ఉన్నాయి. అలాంటి వాటిలో నాభిలో నూనె వేయడం కూడా ఒకటి.  సాధారణంగా వాడుక భాషలో నాభిని బొడ్డు అని అంటారు. బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు బొడ్డు నుండే తల్లి నుండి బిడ్డకు ఆహారం అందుతుంది. అందుకే బొడ్డుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.  ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు బొడ్డులో  బాదం నూనె వేస్తే షాకింగ్ ఫలితాలు ఉంటాయని అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. దీని గురించి తెలుసుకుంటే..

బాదం నూనెలో పోషకాలు..

బాదం నూనెలో విటమిన్-ఎ,  విటమిన్-ఇ,  ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, మెగ్నీషియం,  బయోటిన్ వంటి పోషకాలు ఉంటాయి.

ప్రయోజనాలు..

బాదం నూనెను బొడ్డులో వేయడం వల్ల పనిభారం,  ఒత్తిడి,  కాలుష్యం మొదలైన వాటి కారణంగా చర్మం కోల్పోయిన గ్లోను తిరిగి తీసుకు వస్తుందట.  ఇది ఒత్తిడిని నియంత్రిస్తుందని,  బొడ్డు చుట్టూ ఉండే నాడీ వ్యవస్థను సక్రమం చేస్తుందని అంటారు.

ముఖం వాడిపోయి కళా విహీనంగా ఉన్నవాళ్లు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బొడ్డులో కొన్ని చుక్కల బాదం నూనె వేస్తుంటే చర్మం కాంతివంతం అవుతుంది.

రోజూ రాత్రి పడుకునేముందు బొడ్డులో బాదం నూనె కొన్ని చుక్కలు వేస్తుంటే జుట్టు రాలే సమస్య కూడా  తగ్గుతుందట.  ఇది నాడీ వ్యవస్థను సక్రియం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది.  దీని వల్ల జుట్టు, చర్మానికి మేలు జరుగుతుంది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం బాదం నూనెలో బొడ్డులో వేస్తుంటే కడుపులో నొప్పి,  గ్యాస్,  అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.


                                          *రూపశ్రీ.