బీట్రూట్ లేదా గుమ్మడి గింజలు.. వేటిలో ఐరన్ మెరుగ్గా ఉంటుంది!

ఆహారంతోనే ఆరోగ్యం సాధ్యమని ఆయుర్వేదం ఎప్పుడో చెప్పింది. ఇప్పటికీ ఆరోగ్య సమస్యలకు చాలా వరకు ఆహారంతోనే పరిష్కారం చెప్పేది ఆయుర్వేదమే.. అయితే నేటికాలపు ఇంగ్లీషు వైద్య విధానం ప్రతి సమస్యకు ఒక కొత్త పేరు పెట్టి, వాటికి తగ్గ మందులను సూచిస్తుంది. కానీ మనిషి శరీరంలో ఎంతో అత్యవసర ద్రవ్యమైన రక్తం విషయంలో మాత్రం ఏ వైద్యమైనా ఆహారం ద్వారా మెరుగు పడటమే ఉత్తమం అని చెబుతుంది. మనిషి శరీరంలో రక్తం చాలా ముఖ్యమైనది. రక్తానికి రంగును, హిమోగ్లోబిన్ శాతాన్ని మెరుగ్గా ఉంచడంలో సహాయపడేది ఐరన్. ఐరన్ వల్లే రక్తం ద్వారా ఆక్సిజన్ శరీరంలోని అన్ని అవయవాలకు సరఫరా అవుతుంది. పోషకాలు సరఫరా అవుతాయి. అందుకే ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. సాధారణంగా ఐరన్ కోసం చాలామంది బీట్రూట్ తినమని లేదా బీట్రూట్ జ్యూస్ తాగమని చెబుతుంటారు. కానీ ఐరన్, గుమ్మడి గింజలు రెండింటిలో ఐరన్ ఉంటుంది. అయితే.. ఈ రెండింటిలో ఎందులో ఐరన్ ఎక్కువ ఉంటంది? ఈ విషయం తెలిస్తే ఐరన్ కోసం ఏది తింటే బెటర్ అనేది కూడా డిసైడ్ చేసుకోవచ్చు.
గుమ్మడి గింజలు..
శరీరంలో ఐరన్ లోపం ఉంటే.. దాన్ని తిరిగి భర్తీ చేయడంలో బీట్రూట్ బెస్ట్ అని అనుకుంటారు. కానీ.. పోషకాహార నిపుణులు మాత్రం దీని గురించి కొన్ని రహస్యాలు చెబుతున్నారు.
గుమ్మడికాయ గింజలలో బీట్రూట్ కంటే ఎక్కువ శాతం ఐరన్ ఉంటుందట. గుమ్మడికాయ గింజలలో 100గ్రాముల గింజలలో దాదాపు 8.8mg ల నుండి 9mg ల వరకు ఐరన్ ఉంటుంది.
రోజువారీ శరీరానికి అవసరం అయిన ఐరన్ లో ఎక్కువ శాతాన్ని గుమ్మడి గింజలు భర్తీ చేయగలుగుతాయి.
గుమ్మడి గింజలు ఇలా తింటే బెస్ట్..
గుమ్మడికాయ గింజలలో నాన్-హీమ్ ఐరన్ ఉంటుంది. శరీరానికి దీనిని సమర్థవంతంగా గ్రహించడానికి విటమిన్-సి అవసరం అవుతుంది. అందుకే ఈ విత్తనాలను కొద్దిగా నిమ్మరసం లేదా నిమ్మకాయ నీటితో తీసుకోవడం వల్ల ఐరన్ శోషణ మెరుగవుతుంది.
బీట్రూట్..
బీట్రూట్ హిమోగ్లోబిన్ ను పెంచుతుందని అనుకుంటారు. కానీ 100గ్రాముల బీట్రూట్ లో కేవలం 0.8mg ఐరన్ మాత్రమే ఉంటుంది. అందుకే గుమ్మడికాయ విత్తనాల కంటే బీట్రూట్ లో ఐరన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది.
*రూపశ్రీ.




