ఊపిరితిత్తులు శరీరంలో ముఖ్యమైన అవయవాలు.  ఇవి శ్వాస వ్యవస్థకు మూలం.  మనం పీల్చేగాలిలో ఆక్సిజన్ ను గ్రహించి,  కార్బన్ డై ఆక్సైడ్ ను బయటకు పంపడంలో ఊపిరితిత్తులదే కీలక పాత్ర.  సాధారణంగా ఊపిరితిత్తులు ధూమపానం వల్ల చెడిపోతుంటాయి.  ధూమపానం చేయనివారు కూడా ఊపిరితిత్తులు పాడైపోయి సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారు. దీనికి కారణం పరోక్ష ధూమపానం, అలాగే వాతావరణ కాలుష్యం కూడా.  ఊపిరితిత్తులు పాడైపోతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.  కళ్లలో చికాకు, గొంతునొప్పి వంటి సమస్యలు కూడా ఉంటాయి.  అయితే ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే  కొన్ని పానీయాలు బాగా హెల్ప్ చేస్తాయి.

తులసి నీరు..

తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.  ఇవి ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడతాయి.  రోజూ తులసి ఆకులను నీటిలో వేసుకుని తాగుతున్నా, తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి తీసుకుంటున్నా మంచి ఫలితాలు ఉంటాయి.
అల్లం టీ..

అల్లంలో కూడా యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు ఉంటాయి.  ఛాతీలో, గొంతులో పేరుకున్న కఫాన్ని బయటకు పంపడంలో అల్లం బాగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది. అల్లాన్ని నీటిలో మరిగించి ఆ నీటిని తాగుతుంటే ఊపిరితిత్తులు శుభ్రపడతాయి.

పుదీనా టీ..

పుదీనాలో మెంథాల్ ఉంటుంది.  ఇది శ్వాస గొట్టాలను తెరవడంలో,  శ్వాస బాగా ఆడటంలో సహాయపడుతుంది.  ఊపిరితిత్తులను క్లియర్ చేస్తుంది.  పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది.

లెమన్ వాటర్..

నిమ్మకాయ నీరులో విటమిన్-సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.  ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుతుంది. నీళ్లలో నిమ్మరసం కలుపుకుని రోజూ తాగుతుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

వాము నీరు..

వాము కూడా ఛాతీలోనూ, గొంతులోనూ పేరుకున్న కఫాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.  ఊపిరితిత్తులను శుభ్రం చేయడంలో కూడా సహాయపడుతుంది. వాము గింజలను నీటిలో వేసి మరిగించి అందులో కొద్దిగా బెల్లం కలిపి తాగితే మంచిది.


                                                 *రూపశ్రీ.