థైరాయిడ్ మానవ శరీరంలో ముఖ్యమైన గ్రంథి.   ఇది హార్మోన్లను విడుదల చేయడం ద్వారా  పలు శారీరక విధులు సక్రమంగా ఉండేలా చేస్తుంది.  ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగా లేకుంటే శరీరంలో చాలా కార్యకలాపాలు గాడి తప్పుతాయి.  థైరాయిడ్ సమస్యలతో ఇబ్బంది పడేవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. లేకపోతే థైరాయిడ్ గ్రంథి పనితీరు మరింత దెబ్బతింటుంది. ఇంతకీ ఏయే ఆహారాలకు దూరంగా ఉండాలంటే..

సోయా ఉత్పత్తులు..

సోయా ఉత్పత్తులు థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది.  ఇది థైరాయిడ్ కోసం వాడే మందుల శోషణను అడ్డుకుంటుంది.  సోయా ఉత్పత్తులైన సోయా బీన్స్,  సోయా పాలతో చేసే పనీర్,  సోయా పాలు,  పచ్చిగా బీన్స్ లాగా ఉన్న సోయాను ఎడమామ్ అంటారు.. ఇవన్నీ కూడా సోయాకు సంబంధించినవే.. వీటిని థైరాయిడ్ ఉన్నవారు తీసుకోకూడదు.

క్రూసిఫరస్ కూరగాయలు..

బ్రోకలి, కాలిఫ్లవర్,  క్యాబేజీ వంటి కూరగాయలను క్రూసిఫరస్ జాతికి చెందిన కూరగాయలు అంటారు.  వీటిలో గోయిట్రోజెన్ లు ఉంటాయి.  ఇవి పెద్ద మొత్తంలో తీసుకుంటే ప్రమాదం.  ముఖ్యంగా వీటిని చాలామంది డైట్ లో భాగంగా పచ్చిగానే తింటూ ఉంటారు. కానీ ఇవి థైరాయిడ్ పనితీరును దెబ్బతీస్తాయి.

గ్లూటెన్..

ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ ఉన్నవారు గ్లూటెన్ ఆహారాలు తీసుకోకూడదు. గ్లూటెన్ ఉన్న ఆహారాలు తీసుకుంటే థైరాయిడ్ వాపు మరింత పెరుగుతుంది. గోధుమలు, బార్లీ,  బియ్యం మొదలైనవాటికి దూరంగా ఉండాలి.

చక్కెర..

చక్కెర చాలామందికి సాధారణం అయిపోయింది. కానీ చక్కెరతో కూడిన స్నాక్స్,  డ్రింక్స్ బరువు పెరగడానికి దారి తీస్తాయి. అంతే కాదు ఇవి ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తాయి. థైరాయిడ్ సమస్యలను క్లిష్టతరం చేస్తాయి.

ప్రాసెస్ ఫుడ్స్..

ప్రాసెస్ ఫుడ్స్ కూడా థైరాయిడ్ సమస్య ఉన్నవారు తినకూడదు.  వీటిలో  ప్రిజర్వేటివ్ లు అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.  ఇవి థైరాయిడ్ వాపుకు,  బరువు పెరగడానికి దారితీస్తాయి.

అయోడిన్..

అయోడిన్  ఆరోగ్యానికి మంచిదే కానీ.. అయోడిన్ అధికంగా ఉన్న ఉప్పును తీసుకుంటే థైరాయిడ్ పనితీరుకు అంతరాయం ఏర్పడుతుంది. థైరాయిడ్ ఉన్నవారు  అయోడిన్ ను చాలా పరిమితంగా తీసుకోవాలి.

ఫ్రైస్..

వేయించిన ఆహారాలు కూడా థైరాయిడ్ పనితీరును దెబ్బతీస్తాయి. వేయించిన ఆహారాలు బరువు పెరగడానికి థైరాయిడ్ గ్రంథి వాపుకు దారితీస్తాయి.  థైరాయిడ్ ఆరోగ్యా్న్ని ప్రతికూలంగా మారుస్తాయి.

కెపిన్..

కెఫిన్ ఉన్న కాఫీ, టీ,  శీతలపానీయాలు తీసుకుంటే థైరాయిడ్ పనితీరు దెబ్బ తింటుంది. ఆందోళనను పెంచుతుంది.  ఇది థైరాయిడ్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.


                                                  *రూపశ్రీ.