నిద్ర గొప్ప మెడిసిన్ అంటారు.  కంటి నిండా నిద్రపోయేవారి ఆరోగ్యం చాలా మటుకు చాలా బాగుంటుంది.  హాయిగా నిద్ర పోయే వారు మానసిక ఒత్తిడి,  డిప్రెషన్,  ఆందోళన వంటి మానసిక సమస్యలను చాలా బాగా డీల్ చేయగలుగుతారు. అంతేనా రాత్రి సమయంలో బాగా నిద్రపోయేవారు తమ రోజును పర్పెక్ట్ గా హ్యాండిల్ చేయగలుగుతారు. రాత్రి సమయంలో నిద్రపోయే వారి శరీరంలో నిద్ర చక్రం ఒక క్రమ పద్దతిలో పనిచేస్తుంది.  అయితే ఈ కాలంలో చాలామంది నిద్ర సరిగా పట్టక ఇబ్బందులు పడుతుంటారు.  రాత్రి తొందరగా పక్క మీదకు చేరినా తొందరగా నిద్ర పట్టక గంటలు గంటలు దొర్లుతూ కాలం గుడుపుతారు.  అయితే కొన్ని పనులు చేయడం వల్ల రాత్రి సమయంలో హాయిగా నిద్ర పోవచ్చట. ఇంతకీ అవేంటో తెలుసుకుంటే..

శ్వాస..

లోతైన శ్వాస వ్యాయామాలు శరీరాన్ని, మెదడును, మనస్సును అలసట , ఒత్తిడి నుండి బయటకు తెస్తాయి.  ఈ కారణం వల్ల నిద్రపోయే ముందు లోతైన శ్వాస వ్యాయామాలు, ధ్యానం వంటివి పాటించడం పడుకున్న తరువాత తొందరగా నిద్ర వస్తుంది.  నిద్రలేమి,  తొందరగా నిద్ర పట్టకపోవడం వంటి సమస్యతో ఇబ్బంది పడేవారు లోతైన శ్వాస వ్యాయామాలు ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం.

శ్రద్ద..

శ్రద్ద వల్ల నిద్ర పట్టడం ఏంటి అని చాలా మంది అనుకుంటారు. కానీ నిద్ర పట్టడం కోసం చేసే లోతైన శ్వాస వ్యాయామాల విషయంలో శ్రద్ద చాలా అవసరం. శ్వాస వ్యాయామాలు మనస్సుకు, శరీరానికి విశ్రాంతి తీసుకోవడానికి  సహజ మార్గంలా సహాయపడతాయి.  ఈ శ్వాస వ్యాయామాలు శరీరానికి ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది.  ఇది శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.

డిజిటల్ డిటాక్స్..

డిటాక్స్ అంటే కలుషితం అవ్వడం.  డిజిటల్ యుగంలో శరీరం చాలా రకాల సమస్యలతో కలుషితం అవుతోంది.  ముఖ్యంగా ఎప్పుడూ ఫోన్ ఉండాల్సిందే.. ఇలా రాత్రి పడుకునేవరకు ఫోన్ చూస్తూ ఉండటం వల్ల అది నిద్ర మీద ప్రభావం చూపిస్తుంది. ఫోన్ లేదా టీవి, ల్యాప్టాప్ నుండి వెలువడే నీలి కాంతి కళ్లకు ఎఫెక్ట్ ఇస్తుంది.  ఈ కాంతి తగిలిన తరువాత తొందరగా కళ్లు విశ్రాంతిలోకి వెళ్లలేవు. అందుకే వీటికి దూరం ఉండాలి. నిద్ర పోవడానికి కనీసం గంట ముందే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, టీవీ వంటి పరికరాలను బంద్ చేయాలి.

మెలటోనిన్ లోపం..

మెలటోనిన్ అనేది హార్మోన్.  మెలటోనిన్ నిద్రకు సహాయపడుతుంది.  ఇది మెదడు పనితీరు ద్వారా ఉత్పత్తి అవుతుంది.  రాత్రి సమయంలో ఫోన్,టీవి, ల్యాప్టాప్ వంటి స్క్రీన్లు పడుకునే వరకు చూడటం వల్ల స్క్రీన్ నుండి వెలువడే బ్లూ లైట్ మెదడును యాక్టీవ్ గా ఉంచుతుంది. మెదడు ఎక్కువసేపు యాక్టీవ్ గా ఉండటం వల్ల మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయి నిద్రకు ఆటంకం కలుగుతుంది.


                                             *రూపశ్రీ.