వాతావరణ కాలుష్యం, పొగలు శిశువుల్ని పుట్టక ముందు, తల్లి కడుపులో ఉన్నపుడే దెబ్బతీస్తున్నాయి అంటున్నారు పరిశోధకులు. గర్భిణీ ఎంత మేర కాలుష్యాన్ని పీలిస్తే, ఆమె కడుపులోని బిడ్డ శ్వాస కోసం అంతగా ఇబ్బంది పడుతుందని గుర్తించారు. ఎందుకంటే ఊపిరితిత్తులోకి మరింత ఆక్సిజన్ ను పంపించటానికి వేగంగా శ్వాస తీసుకోవాల్సి వస్తుందట. కడుపులో బిడ్డ శ్వాస కోసం అంతగా ఇబ్బంది పడుతుందని గుర్తుంచారు. ఎందుకంటే ఉపిరితిత్తులోకి మరింత ఆక్సిజన్ ను పంపించడానికి వేగంగా శ్వాస తీసుకోవాల్సి వస్తుందట కడుపులోని బిడ్డ.
స్విట్జర్లాండ్ పరిశోధకులు వారి అధ్యయనంలో బాగంగా కొంతమంది గర్బిణీల్ని వారి కడుపులోని శిశువుల్నిపరిశీలించారు. అత్యధిక కాలుష్యం బారినపడిన తల్లి కడుపులోని శిశువులు నిమిషానికి 48 సార్లు శ్వాశ తీసుకోగా, తక్కువ కాలుష్యం బారిన పడిన శిశువులు నిమిషానికి 42 సార్లు ఊపిరి తీసుకోవడం గుర్తించారు.
అందుకే గర్భిణీలు వాయుకాలుష్యానికి వీలైనంత దూరంగా స్వచ్ఛమైన వాతావరణంలో ఉంటే పిల్లల శ్వాస కోశ ఇబ్బందులు రావు అంటున్నారు పరిశోధకులు.
.....రమ