స్త్రీలు విష్ణు సహస్రనామం చదవకూడదు... ఎందుకో తెలుసా!

శ్రీ విష్ణు సహస్రనామం విష్ణువు యొక్క వేయి నామాల వర్ణన. విష్ణుసహస్రనామాన్ని స్త్రీలు పారాయణం చేయకూడదని కొందరు పండితులు అంటున్నారు. దీనికి కారణం ఏమిటి? స్త్రీలు విష్ణు సహస్రనామం ఎందుకు పఠించకూడదు..?

విష్ణు సహస్రనామం అంటే విష్ణువు యొక్క 1000 పేర్లు. ఈ 1000 నామాలు శ్రీమహావిష్ణువు మహిమను వివరిస్తాయి. లింగ భేదంలేకుండా విష్ణు సహస్రనామాన్ని జపిస్తుంటారు. కానీ, మహిళలు విష్ణుసహస్రనామం జపించడం సరైనదేనా..? స్త్రీలు విష్ణుసహస్రనామ పారాయణం చేయాలా?వద్దా?అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

1. స్త్రీలు  విష్ణు సహస్రనామం పారాయణం చేయాలా వద్దా అనే దానిపై చాలా మందికి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. స్త్రీలు కూడా విష్ణుసహస్రనామ పారాయణం చేయవచ్చని కొందరు పండితులు చెబుతుంటే, మరికొందరు పండితులు పారాయణ చేయకూడదని అంటున్నారు.

2. కానీ, కొందరు పండితులు పురాణాలలో స్వయంగా పార్వతీ దేవి విష్ణుసహస్రనామాన్ని పఠించిందని, ఇతర స్త్రీలు ఎందుకు పఠించకూడదని ప్రశ్నించారు.

3. మరికొందరు పండితులు విష్ణు సహస్రనామంలోని ఒక శ్లోకాన్ని సూచిస్తారు, ఇది మాత్రమే స్త్రీలు పఠించకూడదు. ఈ శ్లోకం తప్ప విష్ణుసహస్రనామం మొత్తం పఠించవచ్చని తెలిపారు. ఆయన ప్రకారం స్త్రీలు విష్ణు సహస్రనామంలోని ఏ శ్లోకాన్ని పఠించకూడదు..?

"కేనోపాయ లఘునా విష్ణు నామ సహస్రకం".
పఠ్యతే పండితైర నిత్యం స్తోత్రం ఇచ్చామి అహం ప్రభో||''

పార్వతీ దేవి "స్త్రోత్తం ఇచ్చామి" అని శ్లోకంలోని ఈ భాగాన్ని పలకలేదు "పతితం ఇచ్చామి" అని పలికింది. ఈ కారణంచేత పండితులు స్త్రీలు విష్ణు సహస్రనామ పారాయణం చేయకూడదని సూచించారు. కానీ, స్త్రీలు పండితుల ద్వారా విష్ణుసహస్రనామం చేయవచ్చు.

4. విష్ణుసహస్రనామ పారాయణం వల్ల కలిగే లాభాలు:
- సంపద వృద్ధి, ఐశ్వర్యం.
- గురు దోష నివారణ.
- భౌతిక కోరికలు నెరవేరడం
- భయం నుండి విముక్తి
- ఆత్మవిశ్వాసం పెరగడం

అయితే విష్ణుసహస్రనామ పారాయణం చేయాలా? అనే విషయంలో ఇప్పటికీ గందరగోళం నెలకొనే ఉంది. స్త్రీలు పారాయణ పఠించడం సరైనదని కొందరు పండితులు అంటుంటే..మరికొందరు, పారాయణం పఠించకూడదంటున్నారు.  మీరు పారాయణం చేయాలనుకుంటే..పండితుల సహాలమేరకు పారాయణం చేయడం ఉత్తమం.


More Enduku-Emiti