రుద్రాక్ష జపమాల పగిలితే ఏమవుతుంది!
భారతీయ హిందూ ధర్మంలో రుద్రాక్షకు చాలా ప్రాధాన్యత ఉంది. రుద్రాక్షలు సాక్షాత్తు పరమేశ్వరుడి అశ్రువులు అని అంటారు. రుద్రాక్ష మాల ధరించడం, రుద్రాక్ష మాల జపం వంటివి చాలా శక్తివంతమైనవి. ముఖ్యంగా రుద్రాక్ష మాల ధరించిన వారికి పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటుందట. అసలు రుద్రాక్ష మాల ధరిస్తే కలిగే మార్పులు ఏంటి? రుద్రాక్ష మాల పగిలితే ఏమవుతుంది?
రుద్రాక్ష మాలను రెండు విధాలుగా వాడతారు. ఒకటి మెడలో ధరిస్తారు. రెండవది.. జపం చేయడం కోసం వాడతారు. మెడలో ధరించినది జపానికి, జపం కోసం ఉపయోగించినది మెడలో ధరించడానికి వాడకూడదు. రుద్రాక్ష మాల ధరించేవారికి, రుద్రాక్ష మాలతో జపం చేసేవారికి ఆగిపోయిన పనులు పూర్తీ కావడం, మానసిక ఆరోగ్యం మెరుగవడం. తల పెట్టిన పనులు సజావుగా పూర్తవడం వంటివి జరుగుతాయి.
కొన్ని సార్లు రుద్రాక్ష జపమాల లేదా మెడలో ధరించిన మాల ఉన్నట్టుండి విరిగిపోతుంది. ఇలా రుద్రాక్ష మాల విరిగిపోవడం, లేదా కట్ అయిపోవడం ఆ వ్యక్తి జీవితం మీద ప్రభావం చూపుతుందట. ఇలా జరిగినప్పుడు జీవితంలో ఊహించని సంఘటనలను ఎదుర్కోవలసి ఉంటుందని అంటున్నారు.
రుద్రాక్ష మాల అకస్మాత్తుగా విరిగిపోవడం వల్ల పరమేశ్వరుడికి కోవం వచ్చిందని సంకేతం అంట. దీని వల్ల జీవితంలో ఉబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు.
రుద్రాక్ష మాల పగిలిపోవడం అంటే ఆర్థిక సమస్యలలో చిక్కుకోబోతున్నారని సంకేతం అని అంటున్నారు. అలాగే పనులలో ఆటంకాలు కూడా ఏర్పడతాయట.
రుద్రాక్ష పగిలిపోవడం లేదా విరిగిపోవడం వల్ల పనులలో వైఫల్యాలు ఎదుర్కొంటారట. ఇవి మాత్రమే కాకుండా ఏ పని మొదలు పెట్టినా ఆ పని చెడిపోవడం జరుగుతుందట.
రుద్రాక్ష మాల విరిగిపోయినా, అందులో ఉన్న రుద్రాక్షలు బీటలు వారి పగిలిపోయినా ఆ రుద్రాక్ష మాలను అలాగే ధరించకూడదు. పూజా స్థలంలో లేదా చెట్టు కింద ఈ రుద్రాక్ష ముక్కలను పాతిపెట్టాలి.
రుద్రాక్ష మాల కొత్తది ధరించాలి అంటే అమావాస్, పౌర్ణమి, సోమవారం, శివరాత్రి వంటి శివుడికి ప్రీతికరమైన రోజులలో ధరించడం మంచిది.
*రూపశ్రీ.