శంఖు పువ్వులు లేదా అపరాజిత పువ్వులతో పూజ చేస్తే జరిగేది ఇదే..!
అపరాజిత పువ్వులు లేదా శంఖు పువ్వులు సాధారణంగా పూజలో ఉపయోగిస్తారు. ఇవి వివిధ రంగులలో ఉంటాయి. సాధారణంగా తెలుపు, నీలం రంగు పువ్వుల మొక్కలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిని పూజలో ఉపయోగిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుంటే..
అపరాజిత పుష్పాలు లేదా శంఖు పువ్వులు విష్ణువు లేదా శని దేవుడికి చాలా ప్రీతికరమైనవి. వీటితో పూజ చేయడం వల్ల జీవితంలో కష్టాలు తొలగిపోతాయని అంటున్నారు. ముఖ్యంగా ఏవైనా పనులు తలపెట్టినప్పుడు ఆటంకాలు ఎదురవుతుంటే ఈ పువ్వులతో శని దేవుడిని పూజించాలట. ఇలా చేస్తే అడ్డంకులు తొలగి పనులు ముందుకు సాగుతాయట.
పూజ చేసేటప్పుడు అపరాజిత పుష్పాలు లేదా శంఖు పుష్పాలను సమర్పిస్తే ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు చేకూరుతుందట. ముఖ్యంగా ఈ పువ్వులను సమర్పించడం వల్ల విష్ణువు సంతోషిస్తాడు. కుటుంబం మొత్తానికి సంతోషాన్ని ప్రసాదిస్తాడు.
డబ్బు కొరత ఉన్నవారు, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నవారు అపరాజిత పుష్పాలను శివలింగానికి సమర్పిస్తే ఆర్థిక స్థితి బలపడి ధనం చేకూరుతుందట.
కోరిన కోరికలు నెరవేరాలన్నా అపరాజిత పుష్పాలతో పూజించడం మంచిది. సాధకుని కోరికలు నెరవేరతాయి. నిలిచిపోయిన పనులు కూడా ముందుకు సాగుతాయి.
ఏయే దేవుళ్లకు సమర్పించాలంటే..
అపరాజిత పుష్పాలను దుర్గా దేవికి, శని దేవుడు, విష్ణువు వూజలలో ఉపయోగించాలి.
*రూపశ్రీ.