శిశుపాలుని సోదరుడు సాల్వుడు
Salva, brother of Shishupala
సాల్వుడనే పేరు భారతంలో ప్రముఖంగా అందరికీ తెలిసేది ఒక్కచోటే. తన సోదరుల వివాహం కోసం సత్యవ్రతుడు (భీష్ముడు) స్వయంవరంలో మిగిలిన రాజులను ఓడించి అంబ, అంబిక, అంబాలిక అనే యువతులను తీసుకుని వచ్చాడు. అప్పుడు, అంబ తను సాల్వుని వలచానని చెబుతుంది. ఆమెను భీష్ముడు సాల్వుని వద్దకు వెళ్ళమని వదిలివేస్తాడు. ఆ సందర్భంలో కనిపించిన సాల్వుడు దమ ఘోషుని కుమారుడు. శిశుపాలుని తమ్ముడు. శిశుపాలుడిని రాజసూయ యాగంలో శ్రీకృష్ణుడు వధించిన తర్వాత అతనిని విరోధిగా భావించి, శివుడి గురించి తపస్సు చేస్తాడు. శివుని నుంచి ఆకాశగమనం, అద్భుత పటిష్ట నగరం వరాలుగా పొందిన సాల్వుడు శ్రీకృష్ణుని జయించేందుకు అనేకసార్లు ప్రయత్నాలు సాగించి, చివరకు అతని చేతిలో చనిపోతాడు.



