మీకు ఈ చెడు అలవాట్లు ఉంటే ఇప్పుడే వదిలేయండి.. ఇవి జాతకంలో గ్రహాలను బలహీనపరుస్తాయి..!

 


భారతీయ జ్యోతిష్క శాస్ర్తం  ప్రకారం జీవితాన్ని సంతోషంగా,  సంపన్నంగా మార్చుకోవడానికి గ్రహాలు బలంగా ఉండటం  చాలా ముఖ్యం. గ్రహాలు వ్యతిరేకంగా ఉంటే తలపెట్టిన పనులలో ఆటంకాలు, కష్టాలు, ధనం లోపించడం, సంతోషం లేకుండా జరగడం,  అకారంగా గొడవలు,  స్నేహితులు కూడా శత్రువులుగా మారడం వంటివి జరుగుతూ ఉంటాయి.  వీటి వల్ల జీవితంలో ఎదుగుదల లేకపోవడమే కాకుండా, ప్రశాంతత లోపిస్తుంది. రాశిచక్రంలో నవగ్రహాలను బలోపేతం చేయాలనుకుంటే, ప్రతికూల అలవాట్లను వదులుకోవడంతో పాటు సానుకూల అలవాట్లను అలవర్చుకోవడం కూడా చాలా ముఖ్యం. గ్రహాల ప్రకారం ఆ చెడు అలవాట్లు ఏమిటో.. వాటిని వదిలిపెట్టాల్సిన అవసరం ఏమిటో తెలుసుకుంటే..

చంద్రుడు..

ప్రతికూల ఆలోచనలు, నిరాశ,  విచారం అనేవి జాతకంలో చంద్రుని స్థానాన్ని బలహీనపరిచే చెడు అలవాట్లు. కాబట్టి  ఈ మూడు  అలవాట్లకు దూరంగా ఉండాలి.

కుజుడు..

కోపంగా ఉండటం, తొందరపాటుగా ఉండటం,  దూకుడుగా ఉండటం వల్ల జాతకంలో కుజుడు బలహీనపడతాడు. ఇది కొనసాగుతున్న పనిని కూడా అడ్డుకుంటుంది. ఇది  వ్యక్తి పురోగతిని ఆపుతుంది.

బుధుడు

బుధుడు అబద్ధం చెప్పడం, మోసం చేయడం,  కుతంత్రంగా వ్యవహరించడం ఇష్టపడడు. ఈ చర్యల కారణంగా, జాతకంలో దాని స్థానం బలహీనంగా మారుతుంది.  దీని వల్ల  క్రమంగా ఆర్థిక సంక్షోభానికి గురవుతారు.

బృహస్పతి

అతిగా తినడం, దురాశ,  అధిక విలాసాలు బృహస్పతి కోపగించుకునేలా చేస్తాయి. దీనిని నివారించడానికి,  సమతుల్య ఆహారం తీసుకోవాలి.  దురాశకు దూరంగా ఉండాలి.

శుక్రుడు..

అహంకారం, షో చేయడం, గొప్పలు చెప్పుకోవడం,  విలాసాలలో మునిగిపోవడం సరైనది కాదని శుక్రుడు భావిస్తాడు. ఈ అలవాట్లు ఏ వ్యక్తినైనా విధ్వంసం వైపు నడిపిస్తాయి.  వీలైనంత త్వరగా ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.

శని..

సోమరితనం, బాధ్యత నుండి తప్పించుకోవడం,  పని నుండి తప్పించుకోవడం వంటి అలవాట్లను శని దేవుడు అస్సలు సహించడు. అలాంటి వారిని ఆయన శిక్షించి వారి ఆనందం,  శ్రేయస్సు మొత్తాన్ని తీసివేస్తాడు.

గ్రహాలు బలపడాలంటే ఏం చేయాలి?

చంద్రుడు

సానుకూలంగా ఆలోచించాలి. ధ్యానం చేయాలి.   ప్రకృతితో సమయం గడపండి.

కుజుడు.

కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. క్రీడల్లో పాల్గొనడం,   ధైర్యంగా ఉండటం వల్ల కుజుడు బలంగా మారతాడు.

బుధుడు

నిజం మాట్లాడాలి. నిజాయితీగా ఉండాలి.  మాటకు కట్టుబడి ఉండాలి.

బృహస్పతి

దాతృత్వం చేయాలి. సమాచారం అందించే పుస్తకాలు చదవాలి.   గురువులను గౌరవించడం ఎంతో ముఖ్యం.

శుక్రుడు..

మర్యాదగా ఉండాలి. ఇతరుల భావాలను గౌరవించాలి.   సరళతను అలవర్చుకోవాలి.

శని

కష్టపడి పనిచేయాలి. సమయపాలన పాటించడం ముఖ్యం.   ఇతరులకు సహాయం చేయడం, పేద వారికి సహాయం చేయడం చేస్తే శని దేవుడు సంతోషిస్తాడు.

                              *రూపశ్రీ.


More Vyasalu