పారిజాత పువ్వులను ఇలా వాడితే ఎన్నో సమస్యల నుండి బయటపడవచ్చట..!
.webp)
పువ్వులు చాలా రకాలు ఉన్నాయి. ఒక్కో పువ్వుకు ఒకో ప్రత్యేకత ఉంటుంది. వీటిలో చాలా శ్రేష్టమైనది, పవిత్రంగా భావించేది పారిజాతం పువ్వు. ఇది చాలా సువాసన గల పువ్వు. ఇది రాత్రిపూట వికసిస్తుంది. ఈ పువ్వు హిందూ పురాణాలలో కూడా వర్ణించబడింది. ఈ పువ్వు చూడటానికి ఎంత అందంగా ఉంటాయో.. దాని ప్రయోజనాలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. ఈ మొక్క ఆరోగ్య దృక్కోణం నుండి అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ఈ పువ్వులతో ఎన్నో సమస్యల నుండి బయటపడవచ్చట. ఈ పువ్వుల ప్రత్యేకత ఏంటి ఏ సమస్యల నుండి బయటపడవచ్చు? తెలుసుకుంటే..
ప్రత్యేకత..
నేలపై పడిన తర్వాత ఇతర పువ్వులు పూజలో ఉపయోగపడవు. అయితే పారిజాతం పువ్వులు మాత్రమే పూజలో ఉపయోగించబడతాయి. అవి వాటంతట అవే కింద పడతాయి. మత విశ్వాసాల ప్రకారం పారిజాతం మొక్క సముద్ర మథనం సమయంలో ఉద్భవించిందని, ఆ తర్వాత ఇంద్రుడు దానిని స్వర్గంలో స్థాపించాడని చెబుతారు. అందుకే, ఈ మొక్క స్వర్గం నుండి భూమికి వచ్చిందని నమ్ముతారు. ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీ దేవి ఎల్లప్పుడూ నివసిస్తుందని కూడా నమ్ముతారు.
వివాహం కోసం..
ఎవరైనా వివాహంలో ఏదైనా అడ్డంకిని ఎదుర్కొంటుంటే, పారిజాతం యొక్క పరిహారాలు బాగా ఉపయోగపడతాయి. మంగళవారం నాడు, పారిజాతం పువ్వులను నారింజ రంగు వస్త్రంలో పసుపు ముడి వేసి, దేవుడి గదిలో గౌరి దేవి చిత్రం లేదా విగ్రహం ముందు ఉంచాలి. ఇలా చేయడం ద్వారా వారికి తొందరగా వివాహం జరుగుతుందట.
ఆర్థిక స్థితికి..
ఎవరైనా డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే పారిజాత నివారణ వారికి ఉపయోగపడుతుంది. దీని కోసం ఈ మొక్క వేరును చిన్న భాగాన్ని తీసుకొని ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచాలట. ఇలా చేయడం ద్వారా డబ్బు సంబంధిత సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయి.
పురోగతి కోసం..
చాలా ప్రయత్నాలు చేసినా ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోతే, మంగళవారం నాడు పారిజాత పువ్వులతో పరిహారం చేయవచ్చు. పారిజాత పుష్పాల గుత్తిని తీసుకొని ఎర్రటి వస్త్రంలో చుట్టి ఆలయంలో లక్ష్మీ దేవికి సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారట.
*రూపశ్రీ.



