జపమాల
భగవంతుని స్మరించడానికి భగవన్నామం జపించడానికి ముఖ్యమైన సాధనంగా జపమాల ఎంతైన అవసరం వుంది. జప సంఖ్య వేళ్ళతోను వేళ్ళ యందు కణుపుల పైనా లెక్కపెట్టడం కూడా అనాదిగా ఆచరణలో వుంది. జపమాల గూర్చి లింగపురాణంలో వివరంగా తెలుపబడింది. వైష్ణవ మంత్రాలను జపించడానికి తులసిమాల చెప్పబడింది. గణేష్ మంత్రం జపించడానికి గజదంత మాల చెప్పబడింది. త్రిపురసుందరీ దేవి నుపాసించడానికి రక్త చందనం రుద్రాక్షమాలలు చెప్పబడ్డాయి. తంత్ర సారంలో ఈ విషయం విఫులీకరిచబడింది. కాళీపురాణాన్ననుసరించి కుశగ్రంధి (దర్భ)మాలతో చేసే జపం సమస్త పాపాలను హరిస్తుంది. పుత్రజీవ, పద్మాక్ష, భద్రాక్షుదులను కలిపి కూర్చకూడదు. ఏదో ఒక వస్తువుల మాలతోనే జపం చేయ్యాలి.